మిర్రర్‌ఫీలో ఊర్మిళను తలపిస్తోంది
ఊర్మిళ హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమలకు సుపరిచితం.
నడుము అందాలను, నాటైన థై సొగసులను ఆవిష్కరించడంలో స్పెషలిస్ట్ బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్ అప్పట్లో గ్లామ్ సంచలనం. యాయిరే యాయిరే.. అంటూ రంగీలా చిత్రంలో ఒక ఊపు ఊపిన ఈ బ్యూటీ, తన టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తూ...కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చేది. ఊర్మిళ హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమలకు సుపరిచితం. ఆర్జీవీ సినిమాల్లో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా పాపులర్.
ఇప్పుడు ఊర్మిళ స్ఫూర్తితో ప్రియాంక చోప్రా స్పెషల్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. రంగీలా రేంజులో నడుము సొగసును ఆవిష్కరించిన పీసీ ఫిట్ బాడీతో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. టైట్ టాప్, లూజ్ ట్రాక్ ఫ్యాంట్ లో ఊర్మిళ ఎంతో యూనిక్ గా కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.
ఇది సెల్ఫీ కాదు.. మిర్రర్‌ఫీ.. అద్దంలోను ఇది అందంగా ప్రతిబింబిస్తోంది. ప్రియాంక చోప్రా తనలోని #ఊర్మిళా మటోండ్కర్‌ను బయటి ప్రపంచానికి ఆవిష్కరిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేస్తూ అభిమానులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మిర్రర్‌ఫీలో ఊర్మిళను తలపిస్తోందని ఒక అభిమాని వ్యాఖ్యానించగా, ఊర్మిళకైనా మతిచెడేలా పీసీ గ్లామ్ షో అదిరిపోయిందంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.