నాని హీరోయిన్.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది

'డాక్టర్' మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కెరియర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది.

Update: 2024-09-26 04:19 GMT

ఇటీవల వచ్చిన 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో ప్రియాంక తెలుగులో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాని 'గ్యాంగ్ లీడర్' మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. నటిగా ఆమెకది రెండో సినిమా. తరువాత శర్వానంద్ 'శ్రీకారం' చిత్రంలో నటించింది. 'డాక్టర్' మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కెరియర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది.


దీంతో వెంట వెంటనే తమిళంలో ప్రియాంక అరుళ్ మోహన్ కి అవకాశాలు వచ్చాయి. ఈ ఏడాది తమిళంలో రిలీజ్ అయిన 'కెప్టెన్ మిల్లర్' లో ధనుష్ కి జోడీగా ప్రియాంక కనిపించింది. 'గ్యాంగ్ లీడర్' తర్వాత 'సరిపోదా శనివారం' సినిమాలో నానితో మరోసారి జతకట్టిన ప్రియాంక సూపర్ హిట్ అందుకుంది. మరోవైపు జయం రవికి జోడీగా నటించిన తమిళ్ మూవీ 'బ్రదర్' రిలీజ్ కి సిద్ధమైంది. మరో తమిళ్ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా 'ఓజీ'లో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీదున్న ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో జతకట్టబోతోంది. కెవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కావొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' రిలీజ్ కి సిద్ధమవుతోంది. 'లైలా' అనే మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ చేసిన అనంతరం విశ్వక్ అనుదీప్ తో మరొక సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక ఈ ఏడాది 'సరిపోదా శనివారం'తో తెలుగు ప్రేక్షకుల అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ వచ్చే ఏడాది 'ఓజీ'తో పాటుగా విశ్వక్ సేన్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ లోపు తెలుగులో ఈ అమ్మడు ఇంకెన్ని అవకాశాలు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News