ఆ భయంతోనే ఇంట్లో వెంటనే చెప్పలేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ తెలుగమ్మాయిల కొరత అయితే ఇంకా ఎక్కువగా ఉంది.;

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ తెలుగమ్మాయిల కొరత అయితే ఇంకా ఎక్కువగా ఉంది. కెరీర్ ఆరంభంలో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ప్రియాంక జవాల్కర్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మెల్లిగా హీరోయిన్ గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీ వాలా సినిమాతో ప్రియాంక హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన SR కల్యాణ మండపంతో మరో హిట్ ను అందుకున్న ప్రియాంక రీసెంట్ గానే మ్యాడ్ స్వ్కేర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ అయినందుకు తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ మీడియాతో మాట్లాడిన ప్రియాంక తను చేసిన మొదటి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
చదువు అయిపోయిన తర్వాత నుంచే ప్రియాంక షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఏదైనా సినిమా ఛాన్స్ వస్తుందేమోనని ట్రై చేస్తూనే ఉంది. ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలిసి కూడా తనకు నచ్చింది చేసుకుంటుందిలే అని ఏమనకుండా వదిలేశారు. మొత్తానికి విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా సినిమాలో అవకాశం వచ్చింది. సినిమా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ కూడా మొదలైందట.
అయినా ప్రియాంక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమా షూటింగ్ మొదలై వారం రోజులు గడిచాక అప్పుడు అసలు విషయాన్ని ఇంట్లో చెప్పిందట. గీతా ఆర్ట్స్ పెద్ద బ్యానర్ కావడంతో పాటూ, తాను ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేసింది లేదు. ఇదే మొదటి సినిమా అనే రీజన్ తో తనను ఉంచుతారో తీసేస్తారో అనే భయంతో ప్రియాంక ఛాన్స్ వచ్చినప్పటికీ ముందుగా ఎవరికీ చెప్పలేదట.
అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా సెట్స్ పైకి వెళ్లి వారం రోజులయ్యాక ఇక సినిమాలో హీరోయిన్ తానే అని తనకు అనిపించిన తర్వాతే ప్రియాంక ఇంట్లో అసలు విషయాన్ని చెప్పిందట. విషయం తెలియగానే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఫీలయ్యారని, ఆ తర్వాత అందరికీ చెప్పానని ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే ప్రియాంక భయంలో అర్థముంది. చిన్న పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా ఆ సినిమాల్లో హీరోయిన్ గా ఒకరిని అనౌన్స్ చేసి తర్వాత మరొకరితో సెట్స్ పైకి వెళ్లడం ఇంసడ్ట్రీలో చాలా కామన్. అమ్మడు ఆ భయంతోనే అసలు విషయాన్ని ఎవరికీ చెప్పకుండా క్లారిటీ వచ్చాకే అందరికీ చెప్పింది.