హిట్ ఇచ్చి నాని ఆ భామ‌ని ముందుకుతోస్తున్నాడిలా!

ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా మంచి విజ‌యం సాధించింది. సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి.

Update: 2024-09-28 17:30 GMT

నాని `గ్యాంగ్ లీడ‌ర్` తో ప‌రిచ‌య‌మైన బ్యూటీ ప్రియాంక మోహ‌న్. అమ్మ‌డికిది మంచి ల్యాండింగ్. కానీ వైఫ‌ల్యం టాలీవుడ్ లో వెన‌క్కి నెట్టింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో అవ‌కాశం అందుకోవ‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. మ‌ళ్లీ ఆ ఛాన్స్ ఇచ్చింది కూడా నేచుర‌ల్ స్టార్ నానినే. అప్పుడు గ్యాంగ్ లీడ‌ర్ తో ఛాన్స్ ఇప్పుడు `స‌రిపోదా శ‌నివారం`తో రెండ‌వ సారి త‌న‌నే తీసుకున్నాడు. ఈ సారి మాత్రం హిట్ అందుకుంది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా మంచి విజ‌యం సాధించింది. సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. తాజాగా అమ్మ‌డి కెరీర్ బిజీ అవుతోంది. ఇప్ప‌టికే లారెన్స్ స‌ర‌స‌న ఓ సినిమాలో అవ‌కాశం అందుకుంది. త‌మిళ్ లో ఇంకా రెండు..మూడు సినిమ‌ల‌కు సైన్ చేసింది ఈ మ‌ధ్య‌నే. అవ‌న్నీ కూడా శ‌నివారం త‌ర్వాత సైన్ చేసిన చిత్రాలుగా వెలుగులోకి వ‌స్తోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `ఓజీ` సినిమాలోనూ న‌టిస్తోంది.

ఈ సినిమా డిలే అవ్వ‌డంతో అంతా మ‌ర్చిపోయారు. కానీ మ‌ళ్లీ ఇది ప‌ట్టాలెక్కుతుంది. దీంతో ప్రియాంక పేరు నెట్టింట పాపుర‌ల్ లోకి వ‌స్తోంది. పైగా ఓజీ పాన్ ఇండియా సినిమా. ఆ ర‌కంగా ప్రియాంక మోహ‌న్ కెరీర్ లో ఇదే తొలిపాన్ ఇండియా రిలీజ్ కూడా అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ త‌మిళ్, క‌న్న‌డ‌లో న‌టించింది. కానీ తెలుగు నుంచి పాన్ ఇండియాకి వెళ్ల‌డంతో సంతోషం వ్య‌క్తం చేసింది.

అయితే తెలుగులో ఈ మాత్రం గుర్తింపు రావ‌డానికి కార‌ణం మాత్రం నాని అన‌డం ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ప్లాప్అయిన సినిమా నుంచి ఏ హీరో మ‌ళ్లీ తీసుకోడు. కానీ నాని మాత్రం ప్రియాంక‌కు పిలిచి అవ‌కాశం తో పాటు హిట్ ఇచ్చి మార్కెట్ లో కి తోసాడు. అందుకు ఆమె రుణ‌ప‌డాల్సిందే.

Tags:    

Similar News