చోప్రా సిస్టర్స్ డిష్యుం డిష్యుం.. బద్ధ విరోధులేనా?
ఇటీవల ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుక సాక్షిగా ఈ విభేధాలు మరోసారి బయటపడ్డాయని రెడ్డిటర్లు ఊహిస్తున్నారు.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, ఆమె సోదరి పరిణీతి చోప్రా మధ్య విభేధాలు నెలకొన్నాయా? ఇద్దరూ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారా? అంటే అవుననే హిందీ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇటీవల ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుక సాక్షిగా ఈ విభేధాలు మరోసారి బయటపడ్డాయని రెడ్డిటర్లు ఊహిస్తున్నారు.
అక్కా చెల్లెళ్లు మునుపటిలా కలిసి లేరు. విడివిడిగా పెళ్లికి వచ్చి వెళ్లారు. ఆ సమయంలో కలిసి ఫోటో కూడా దిగలేదు. దీంతో ఆ ఇద్దరి నడుమా ఏదో వార్ నడుస్తోందని అభిమానులు ఊహిస్తున్నారు. సిద్ధార్థ్ చోప్రా పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా కూడా కొద్దిసేపు కనిపించారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఇటీవల చోప్రా కుటుంబంలో సిస్టర్స్ నడుమ విభేదాల గురించి కొంత చర్చ సాగుతోంది. ఈ పుకార్ల సమయంలోనే పరిణీతి అనూహ్యంగా సోదరుడి వివాహానికి హాజరైంది. ప్రియాంక సెప్టెంబర్ 2023లో ఉదయపూర్‌లో జరిగిన తన సోదరి వివాహానికి దూరంగా ఉంది. ముంబైలో జరిగిన సిద్ధార్థ్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు పరిణీతి కూడా హాజరు కాలేదు. ఈ గైర్హాజరు కుటుంబంలో వైరం ఉందనే ఊహాగానాలకు దారితీసింది. అయితే పారీ తన తల్లితో పెళ్లికి మాత్రం అటెండయింది. కేవలం ఫార్మాల్టీ కోసం. ఈ మధ్య పరిణీతి తల్లి వివాహ వేడుక నుండి ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేయగా, విభేదాలున్నాయనే పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.
పరిణీతి తల్లి రీనా చోప్రా.. సిద్ధార్థ్ పెళ్లి వేడుకల నుండి ప్రత్యేకమైన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలలో ఎక్కడా చోప్రా సోదరీమణులు కలిసి లేరని అభిమానులు గమనించారు. ఇది వారి మధ్య వైరం గురించి పుకార్లను మరింత పెంచింది. ఈ ఫోటోలను షేర్ చేసిన రీనా నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పరిణీతి ఉన్న ఫోటోలలో ప్రియాంక కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆ ఇద్దరూ కలిసి పోజులివ్వలేదని పరిశీలకులు ఎత్తి చూపారు. ఈ ఊహాగానాలపై సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... పరిణీతి -ప్రియాంక కలిసి ఉన్న ఒక్క ఫోటో కూడా లేదా? వారు లాంఛనప్రాయంగా వచ్చారు.. అని రాసాడు. మరొకరు.. ''ప్రియాంక చోప్రా.. నరేంద్ర మోదీతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఈ జంటను విస్మరిస్తున్నారా?'' అని ప్రశ్నించారు.
ప్రియాంక చోప్రా కూడా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ- ''జీవితాంతం ప్రేమ, ఆనందంతో నిండి ఇలానే కొనసాగాలి #సిద్నీ కి షాదీ!'' అని క్యాప్షన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లికి సంబంధించిన మరో వీడియోలో వధువు నీలం ఉపాధ్యాయకు సన్నిహితంగా ప్రియాంక చోప్రా కనిపించింది. ఒక వీడియోలో తన సోదరుడు సిద్ధార్థ్‌ను మండపానికి తీసుకెళుతూ కనిపించింది. పెళ్లిలో పీసీ డ్యాన్సులు చేస్తూ కూడా అలరించింది.