కాపాడిన వారికి రుణపడి ఉంటాను : ప్రియాంక చోప్రా
మంటలకు తోడు విపరీతమైన గాలుల వల్ల మరింతగా నష్టం జరుగుతుంది.
ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సమస్య వచ్చినా వెంటనే స్పందించి తమకు సాధ్యం అయినంత వరకు సాయం చేయడం లేదా అండగా నిలిచే దేశం అమెరికా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరున్న అమెరికా ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాస్ ఏంజెలెస్ మొత్తం కార్చిచ్చుకు బూడిద అవుతుంది. లక్షల ఇల్లు ఇప్పటికే కాలి బూడిద అయ్యాయి. హాలీవుడ్ ప్రముఖుల ఇల్లు కనీసం ఆనవాళ్లు లేకుండా పోయాయి. గత వారం పది రోజులుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంటలకు తోడు విపరీతమైన గాలుల వల్ల మరింతగా నష్టం జరుగుతుంది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ వేడుకలు లాస్ ఏంజెలెస్‌లో జరుగుతాయి. ఈసారి కార్చిచ్చు వల్ల ఆస్కార్ అవార్డు వేడుక రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద విపత్తుగా ఈ కార్చిచ్చు నష్టంను లెక్కలు వేస్తున్నారు. హాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ స్థాయి కళాకారులకు చెందిన వందలాది ఇల్లులు కార్చిచ్చులో కాలి బూడిద అయ్యాయి. ఇండియన్ నటి ప్రియాంక చోప్రా సైతం కార్చిచ్చు వల్ల చాలా నష్టపోయింది.
సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందించింది. తమ కుటుంబం ఎంత బాధ పడుతుందో మాటల్లో చెప్పలేను. ఈ కార్చిచ్చు నుంచి మేము బయట పడటంకు సహాయం చేసిన వారికి రుణపడి ఉంటాను. ఈ విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న ఫైటింగ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఫైర్ ఫైటర్స్, వాలంటీర్లు, ప్రభుత్వ యంత్రాంగం తమ ప్రాణాలను సైతం లక్ష్యపెట్టకుండా మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో మీరు చేస్తున్న యుద్ధం గొప్పది. మీరు అసలైన హీరోలు. మీకు ప్రతి ఒక్కరి నుంచి కృతజ్ఞతలు అంటూ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది.
బాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో సినిమాలు, సిరీస్‌లతో మెప్పించింది. అక్కడ ఓ రేంజ్‌లో సక్సెస్ దక్కడంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. అదే సమయంలో తనకంటే పదేళ్ల చిన్నవాడు అయిన నిక్ ను వివాహం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా భర్త పాపతో కలిసి ప్రియాంక చోప్రా లాస్ ఏంజెలిస్‌లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు కార్చిచ్చు ఆమె నివాసం ను చుట్టుముట్టడంతో అక్కడ నుంచి బయట పడింది. వారి ఇల్లు ఉందా లేదా అనేది మాత్రం ప్రియాంక చోప్రా క్లారిటీ ఇవ్వలేదు.