పవన్‌ కోసం ఆమె డాక్టర్‌...!

పవన్‌ కళ్యాణ్ మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. రాజకీయాల కారణంగా వాటన్నింటిని గత కొన్ని నెలలుగా పక్కకు పెట్టిన విషయం తెల్సిందే.

Update: 2024-08-14 07:03 GMT

పవన్‌ కళ్యాణ్ మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. రాజకీయాల కారణంగా వాటన్నింటిని గత కొన్ని నెలలుగా పక్కకు పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్ ఒకటి రెండు నెలల్లో తిరిగి మధ్య లో ఉన్న ఆ మూడు సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇటీవల నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ విషయమై చర్చించాడని సమాచారం అందుతోంది. ఓజీ సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ దర్శకుడు సుజీత్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.


ఇప్పుడు ఓజీ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అలకనంద పాత్రలో ప్రియాంక అరుల్‌ మోహన్ ను చూడబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి ఓజీ లో ప్రియాంక రోల్‌ గురించి ప్రచారం జరుగుతోంది. డాక్టర్ అలకనంద గా ప్రియాంక ను ఓజీ లో చూడబోతున్నామని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.

నాని హీరోగా నటించిన గ్యాంగ్‌ లీడర్‌ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్‌ మోహన్ ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల నానితో సరిపోదా శనివారం సినిమాలో కూడా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటే టాలీవుడ్‌ లో ప్రియాంక అరుల్‌ మోహన్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలవడంతో పాటు, స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

ఇక పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు హరి హర వీరమల్లు సినిమా మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ లో నటిస్తున్నాడు. హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి పార్ట్‌ కి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. 15 నుంచి 20 రోజుల పాటు పవన్ డేట్లు ఇస్తే వీరమల్లు పూర్తి అవ్వనుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా కోసం పవన్ కేవలం ఒక్క షెడ్యూల్‌ కే వర్క్ చేశాడు. ఈ మూడు సినిమాలను కూడా వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News