హాలీవుడ్ లో టాలీవుడ్ ట్రెండ్!

హాలీవుడ్ లో టాలీవుడ్ ట్రెండ్ అల‌వాటు ప్ర‌య‌త్నం మొద‌లైందా? అంటే అవున‌నే తెలుస్తోంది

Update: 2024-08-06 10:30 GMT

హాలీవుడ్ లో టాలీవుడ్ ట్రెండ్ అల‌వాటు ప్ర‌య‌త్నం మొద‌లైందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ టాలీవుడ్ ను చూసి హాలీవుడ్ ఏం నేర్చుకుంటుంది? అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్ లో సినిమా ప్రారంభోత్స‌వం ఏ రేంజ్ లో జ‌రుగుతుందో తెలిసిందే. ముందుగా మంచి ముహూర్తం చూసుకుని కొబ్బ‌రి కాయ కొట్టి ఆ రోజు సినిమా ప్రారంభిస్తారు. ఆ రోజు త‌ప్ప‌కుండా హీరో స‌హా అంతా హాజ‌రవుతారు.

అటుపై చిత్రీక‌ర‌ణ ముగింపు కూడా అంతే గ్రాండ్ గా ఉంటుంది. షూటింగ్ పూర్త‌యిన చివ‌రి రోజు సంద‌ర్భంగా గుమ్మ‌డికాయ కొడ‌తారు. అంటే కొబ్బ‌రి కాయ‌తో మొద‌లు పెట్టి గుమ్మ‌డికాయ‌తో ముగింపు ప‌ల‌క‌డం అన్న మాట‌. షూటింగ్ కి సంబంధించి ఇంకెలాంటి పెండింగ్ లేద‌ని...ఉన్న‌ద‌ల్లా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు , రిలీజ్ మాత్ర‌మేన‌ని తెలియ‌జేసే సంద‌ర్బం ఇది. టాలీవుడ్ లో చాలా కాలంగా వ‌స్తోన్న ఆచారం ఇది.

తాజాగా ఇదే విధానం హాలీవుడ్ కి సైతం బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా అలవాటు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా ది బ్ల‌ప్ అనే సినిమాలో న‌టిస్తోంది. ప్రాంక్ ఇ ప్ల‌వ‌ర్స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్త‌యింది. ముగింపు రోజు సంద‌ర్భంగా టీమ్ అంద‌రూ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. గుమ్మ‌డికాయ కొట్ట‌లేదు గానీ న‌టించిన న‌టీన‌టులు, ప‌నిచేసిన‌టెక్నిషియ‌న్లు అంతా చివ‌రి రోజు హాజ‌రై అంతా ఓ వేడుక‌లో చేసుకున్నారు.

హాలీవుడ్ లో ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాకి ఇలా సెల‌బ్రేష‌న్ అన్న‌ది జ‌ర‌గ‌లేదుట. సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో? ఎ ప్పుడు పూర్త‌వుతుందో అందులో ప‌నిచేసే అంద‌రూ ప‌ట్టించుకోరుట‌. అక్కడ న‌టులు, టెక్నీషియ‌న్లు అంతా కేవ‌లం త‌మ ప‌ని వ‌ర‌కే పరిమిత‌మ‌వుతారుట‌. అంటే టైమ్ టూ టైమ్ అటెండ్ అవ్వ‌డం ప‌ని చూసుకుని వెళ్లిపోవ‌డం త‌ప్ప అంత‌కు మించి బాండింగ్ అక్క‌డ క‌నిపించ‌ద‌ట‌.

అయితే `ది బ్ల‌ప్` షూటింగ్ చివ‌రి రోజు అంతా క‌ల‌వ‌డం అన్న‌ది ప్రియాంక‌ వ‌ల్లే జ‌రిగింద‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా అంద‌ర్నీ క‌ల‌వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని హాజ‌రైన వారంతా అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తానికి పీసీ కార‌ణంగా అక్క‌డా సినిమా యూనిట్ లో ఓ ఐక్య‌త క‌నిపిస్తుంది. అందుకు ప్రియాంక ను మెచ్చుకోవాల్సిందే.

Tags:    

Similar News