ప్రియా ప్రకాష్.. తడిసిన అందాలతో స్టన్నింగ్
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ మలయాళీ బ్యూటీ అందులో చిన్న రోల్ లో కనిపించింది. అయితే సాంగ్ లో ఆమె కన్నుకొట్టి ఇచ్చిన స్మైల్ కి కుర్రకారు ఫ్లాట్ అయిపోయారు. రాత్రికి రాత్రి మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చేశారు. ఓ విధంగా ఈ అమ్మడు అందమే తనని సెలబ్రెటీగా మార్చేసింది.
ఓవర్ నైట్ స్టార్ డమ్ తో ప్రియా ప్రకాష్ వారియర్ కి వరుసగా కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశం వచ్చింది. ఆమె రెండో సినిమా వచ్చేలోపు పదుల సంఖ్యలో యాడ్స్ చేసి బాగా ఫేమ్ సంపాదించింది. అలాగే ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లతో కూడా సందడి చేస్తూ ఉండేది. హీరోయిన్ గా మాత్రం ప్రియా ప్రకాష్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి. తెలుగులో ఇష్క్ అనే మూవీలో తేజా సజ్జాకి జోడీగా నటించింది.
ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత చెక్ మూవీలో నితిన్ తో జతకట్టింది. అది కూడా ఫ్లాప్ అయ్యింది. తరువాత మాతృభాషలో మూడు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ బ్రో మూవీలో సిస్టర్ పాత్రలో కనిపించింది. ఈ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పాలి. యారియాన్ 2 మూవీతో హిందీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ మెల్లగా అవకాశాలు పెంచుకుంటుంది.
విష్ణు ప్రియా అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు రెగ్యులర్ గా గ్లామర్ హాట్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా ఓనం సమయంలో మలయాళీ అమ్మాయిలు కట్టుకునే వైట్ కలర్ శారీతో సరస్సులో జలకాలాడుతూ సందడి చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
వైట్ కలర్ చీరలో ప్రియా ప్రకాష్ వారియర్ దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉందనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. అప్పుడే ఒడ్డుకు కొట్టుకొచ్చిన సాగరకన్యలా అందాలతో ప్రియా ప్రకాష్ మీరిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.