తప్పుడు సలహాల మీద నిర్మాత కామెంట్స్..!

నాగ చైతన్య తండేల్ సినిమా నిర్మాత బన్నీ వాసు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటర్వ్యూస్ చేశారు.

Update: 2025-02-03 14:25 GMT

నాగ చైతన్య తండేల్ సినిమా నిర్మాత బన్నీ వాసు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటర్వ్యూస్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇష్యూ గురించి కూడా కొందరు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. ఐతే అల్లు అర్జున్ అంశం చర్చించడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదని అన్నారు. ఆ ఇన్సిడెంట్ గురించి అసలు అల్లు అర్జున్ గురించి గానీ మాట్లాడనని చెప్పారు బన్నీ వాసు. ఐతే అల్లు అర్జున్ విషయంలో పక్కన ఉన్న వాళ్లే ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తున్నారు అన్న కామెంట్స్ పై బన్నీ వాసు స్పందించారు.

ఐతే అక్కడ ఉన్న పరిస్థితులు.. ఏం జరిగింది అన్న దాని మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. అందరికీ కొంత క్లారిటీ ఉంది. ఐతే కోర్టు పరిధిలో ఉన్న విషయాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అది అంతా తేలిన తర్వాత తాను మాట్లాడతానని అన్నారు బన్నీ వాసు. సో పక్కన వారి సలహాల వల్లే అల్లు అర్జున్ కొన్ని ఇబ్బందుల్లో పడుతున్నాడు అన్న పాయింట్ గురించి బన్నీ వాసు అండ్ టీం కూడా చర్చిస్తుందని తెలుస్తుంది.

అల్లు అర్జున్ బన్నీ వాసుల బంధం ఈనాటిది కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా వారిద్దరు ఒక్కటిగా ప్రయాణం చేస్తున్నారు. ఐతే అల్లు అర్జున్ విషయంలో జరిగిన కేసు విషయమై అతని పక్కనే ఉన్న బన్నీ వాసు మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఫ్యాన్స్ ఇంకా మిగతా ఆడియన్స్ కూడా బన్నీ వాసు ఏం చేస్తున్నాడు అన్న చర్చ జరిగింది. వీటిపై చూచాయగా స్పందించిన బన్నీ వాసు టీం అంతా డీప్ డిస్కస్ చేశామని అన్నారు.

ఐతే ఇది కేవలం అల్లు అర్జున్ ఒక్కడి సమస్యే కాదు స్టార్ హీరోలు అందరు వారి చుట్టు పక్కన వారికి సపోర్ట్ గా ఉన్న వారందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఐతే అల్లు అర్జున్ విషయంలో పక్కన ఉన్న వారు ఏం చేస్తున్నారు. వారి తప్పుడు సలహాల వల్లే ఇలా జరిగింది అన్న కామెంట్స్ మాత్రం కచ్చితంగా అల్లు అర్జున్ తో ఉన్న టీం ని ఇబ్బంది పెట్టిస్తుంది. ఐతే నిజం ఏంటన్నది ఆ హీరోకి తెలుసు. తన టీం ఏంటన్నది కూడా తెలుసు కాబట్టి ఇక మీదట ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు.

Tags:    

Similar News