సినిమాకు తండ్రే నిర్మాత.. సో కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు!
చెప్పాలంటే సినిమాకు దర్శకుడు తల్లి అయితే.. నిర్మాత తండ్రి లాంటి వాడు.
సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం.. అయితే అంత మంది కష్టపడడానికి.. మూవీ రిలీజ్ అవ్వడానికి ఒకే ఒక్క సాధనం డబ్బు.. ఆ డబ్బు ఇచ్చేది/పెట్టుబడి పెట్టేది నిర్మాత. కానీ ఆ నిర్మాత ఎప్పుడూ ఆఖరిగానే ఉంటాడు! సినిమా టైటిల్స్ లో ఆఖరే.. మూవీ హిట్ అయితే పేరు తీసుకోవడంలో ఆఖరే.. లాభాలు తీసుకోవడంలో కూడా ఆఖరే.. అందరికీ అన్ని క్లియర్ చేశాక తనకు వచ్చిన లాభాలను చివరగా తీసుకుంటాడు.
చెప్పాలంటే సినిమాకు దర్శకుడు తల్లి అయితే.. నిర్మాత తండ్రి లాంటి వాడు. కానీ అలాంటి తండ్రిపై ఇప్పుడు కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమాలు తీయడమే రాదు.. ఎందుకు అలా మూవీలు తీస్తున్నారని అనవసరంగా దూషిస్తున్నారు.. అయితే 100 శాతంలో 96 శాతం సినిమాలు ఫ్లాపులు అయ్యి.. నాలుగు శాతమే హిట్ అవుతున్నా.. సినిమాలు ఇంకా రూపొందిస్తున్నారంటే నిర్మాతలే గ్రేట్ అని చెప్పాలి.
థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే టార్గెట్ తోనే సినిమాలు తీస్తారు ఎవరైనా. 100 శాతంలో నాలుగు శాతం సినిమాలే ఆడుతున్నా.. అందరూ ఆ నాలుగు శాతంలో ఉందామనే చిత్రాలు రూపొందిస్తున్నారు. ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలి.. సక్సెస్ కొట్టాలి.. ఈ రెండు లక్ష్యాలతోనే సినిమాలు చేస్తారు. యావరేజ్ లేదా ఫ్లాప్ గా నిలుస్తుందని తెలిసే ఎవరూ చిత్రం చేయరు. హిట్ కొట్టాలనే తీస్తారు... ఎఫర్ట్స్ పెడతారు.
ఏ నమ్మకంతో సినిమాలు తీస్తున్నారో.. అంతే నమ్మకంతో ఆడియన్స్ తమ నచ్చిన సినిమాలను ఆదరిస్తున్నారు. చెప్పాలంటే.. ఇండస్ట్రీని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. కాబట్టి వారికి ఉపాధి ఉండాలంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా నిర్మాతలు సినిమాలు తీయాలి. అసలు వారు లేకపోతే ఎంతో మందికి ఉపాధే లేదు. అందుకే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా యావరేజ్ గా ఉన్నా నిర్మాతలను విమర్శించడం తగదు.
వారి వారి ప్రొడక్షన్ హౌస్ పై కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అలా దూషించే ముందు.. ఎంతో మంది ఉపాధి దొరుకుతున్న విషయం మైండ్ లోకి రావాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇండస్ట్రీపై ఆధారపడే వారితో పాటు నార్మల్ ఆడియన్స్.. ఒక్క మూవీకి బాగోలేదని.. ఏకంగా నిర్మాతనే విమర్శించడం సరికాదు.. అందరినీ సర్దుబాటు చేసుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తాడు నిర్మాత. అలా అని ఇండస్ట్రీలో ఏ ఒక్కరిపై కూడా విమర్శలు చేయకూడదు.