అలా చేయకుంటే సినిమాను కాపాడుకోలేం: దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్

Update: 2024-04-08 04:14 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీకి డివైడ్ రివ్యూలు వచ్చాయి.

అయితే దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఎన్నడూ లేనంతగా ఈ సినిమా విషయంలో కనపడింది. మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. స్టేజ్ పై డ్యాన్సులు చేశారు. పలు ఈవెంట్స్ లో ఫ్యామిలీతో సందడి చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లకు వెళ్లి ఫ్యాన్స్ రెస్పాన్స్ ను గమనించారు. ఏకంగా మైక్ పట్టుకుని రిపోర్టర్ గా మారి రివ్యూలు కూడా తీసుకున్నారు. సినిమాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.

తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి సంబంధించి మాట్లాడారు దిల్ రాజు. 'ఫ్యామిలీ స్టార్ సినిమా చూసి కుటుంబ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు. కొందరు నాకు కాల్ చేసి మరీ చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కావాలనే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ కు మా సినిమా బాగానే రీచ్ అయింది. మేం ఒక మంచి చిత్రాన్నే తెరకెక్కించాం" అని తెలిపారు.

"ఏదైనా సినిమాపై కావాలనే నెగిటివ్ ప్రచారం చేయడం పరిశ్రమకు అస్సలు మంచిది కాదు. అయితే కేరళలో ఇటీవల ఓ కోర్టు తీర్పు ఇచ్చిందని విన్నా. మూవీ రిలీజ్ అయ్యాక మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక్కడ కూడా అలాంటిది ఉంటే బాగున్ను. లేకపోతే సినిమాను కాపాడుకోలేం. ఏ ఇండస్ట్రీలో కూడా కావాలనే నెగిటివ్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు" అంటూ దిల్ రాజు ఫైర్ అయ్యారు.

"ముందు నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్లు.. థియేటర్లకు వచ్చి మా సినిమా చూడండి. మీకు నచ్చితే నలుగురికి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నచ్చకపోతే మేం ఎక్కడ తప్పు జరిగిందనేది తెలుసుకుంటాం. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మీకు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు దిల్ రాజు. మరి చూడాలి దిల్ రాజు స్టేట్మెంట్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News