అగ్ర‌హీరో త‌మ్ముడి భార్య‌తో పుత్ర‌ర‌త్నం ఎఫైర్.. ఆవేద‌న‌లో నిర్మాత‌!

అంతేకాదు.. అస‌లు ఎందుకూ కొర‌గాని త‌న కొడుకు హీరో అవుతాడ‌ని తొలిగా గ్ర‌హించింది కూడా ఆ అగ్ర హీరోనే

Update: 2024-04-03 02:30 GMT

భార‌త‌దేశంలోనే నంబ‌ర్ వ‌న్ హీరోగా పాపుల‌రైన‌ హీరోతో అగ్ర నిర్మాత స్నేహం, సాన్నిహిత్యం త‌న‌ పుత్ర‌ర‌త్నం వ‌ల్ల స‌ర్వ‌ నాశ‌నం అవ్వ‌డంపై బ‌హిరంగ వేదిక‌ల‌పైనే ఆ నిర్మాత ఎంత‌గానో ఆవేదన చెందాడు. అగ్ర హీరోతో నిర్మాత బంధం వంద‌ల కోట్ల బిజినెస్‌కి సంబంధించిన‌ది. అదంతా త‌న కొడుకు వ‌ల్ల‌నే నాశ‌న‌మైంద‌ని అత‌డు క‌ల‌త చెంద‌ని రోజు లేదు. చాలా వేదిక‌ల‌పై త‌నయుడు చేసిన ప‌ని సిగ్గు చేటుగా ఉంద‌ని, అత‌డిని తీవ్రంగా మంద‌లించాన‌ని కూడా చెప్పాడు ఆ నిర్మాత‌.

అంతేకాదు.. అస‌లు ఎందుకూ కొర‌గాని త‌న కొడుకు హీరో అవుతాడ‌ని తొలిగా గ్ర‌హించింది కూడా ఆ అగ్ర హీరోనే. నీ కొడుకులో హీరో అయ్యే లక్ష‌ణాలు ఉన్నాయ‌ని కూడా అగ్ర హీరో నిర్మాత‌కు చెప్పాడు. అంతేకాదు.. బాగా లావెక్కి బ‌రువున్నాడు. బ‌రువు త‌గ్గితే హీరో అయ్యేందుకు ఛాన్సుంద‌ని కూడా స‌ద‌రు నిర్మాత‌కు పుత్రర‌త్నం గురించి చెప్పాడ‌ట‌. అప్ప‌టివ‌ర‌కూ త‌న కొడుక్కి హీరో అవుతాన‌నే న‌మ్మ‌కం కూడా లేద‌ని, కానీ త‌న ఫేవ‌రెట్‌ హీరో సూచ‌న వ‌ల్ల‌నే అత‌డిని మార్చాన‌ని కూడా చెప్పాడు.

కానీ ఇంత‌లోనే కొడుకు చేసిన నిర్వాకానికి అగ్ర హీరోతో త‌న రిలేష‌న్ షిప్ దారుణంగా దెబ్బ తింది. నిర్మాత‌- అగ్ర హీరో బాండింగ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గొప్ప‌ది. ఎంత‌గా అంటే ఆ హీరో ఇంట్లోకి నేరుగా వెళ్లి పిచ్చా పాటీ మాట్లాడ‌ట‌మే గాక క‌థ‌లు, స్టోరీ లైన్ లు కూడా వినిపించేవాడు. త‌న‌తో అప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను నిర్మించాడు. అదే అద‌నుగా త‌న‌తో పాటే అగ్ర హీరో ఇంట్లో స్వేచ్ఛ‌గా తిరిగిన త‌న‌యుడు ఆ ఇంటికే ఎస‌రు పెట్ట‌డం ఆవేద‌న క‌లిగించింది.

అంత‌గా ఆ పుత్ర‌ర‌త్నం ఏం త‌ప్పు చేసాడు? అంటే.. స‌ద‌రు అగ్ర హీరో త‌మ్ముడి (అత‌డు కూడా న‌టుడు కం నిర్మాత‌) భార్య‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ ఎఫైర్ వేగంగా మీడియాకెక్కింది. దీంతో అగ్ర హీరో కుటుంబ ప‌రువు బ‌జారున ప‌డింది. ఈ ఎపిసోడ్స్ తో స‌ద‌రు అగ్ర హీరో తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాడు. నిర్మాత‌తో బంధం తెగిపోయింది. ఈ ఊహించ‌ని ప‌రిస్థితికి నిర్ఘాంత‌పోయాడు ఆ నిర్మాత‌. పుత్ర‌ర‌త్నం చేసిన ప‌నికి లెంప‌లేసుకున్నాడు. చాలా కాలం కొడుక్కి త‌ప్పు చేస్తున్నావ్.. ఇది స‌రికాద‌ని న‌చ్చ జెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. కానీ అది ఫ‌లించ‌లేదు. తాను సినిమాలు తీసే పాపుల‌ర్ హీరో త‌మ్ముడి భార్య‌తో బ‌హిరంగంగానే షికార్లు చేయ‌డం ప్రారంభించాడు. దీంతో ఇది మీడియాలో ఇంకా పెద్ద ర‌చ్చ‌యింది. ఏది ఏమైనా ఈ విష‌యాన్ని ఇప్పుడు త‌న సినిమాల రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో చెప్పుకుని తీవ్రంగా కుమిలిపోతున్నాడు ఆ నిర్మాత‌. మొత్తానికి త‌న కొడుకు తిన్నింటి వాసాలు లెక్కించాడ‌ని ఆ నిర్మాత బ‌హిరంగంగానే అంగీక‌రించాడు. అప్ప‌టికే పెళ్ల‌యిన న‌టి కం డ్యాన్స‌ర్ తో పుత్ర‌ర‌త్నం ఎఫైర్ నిజంగానే ఆ నిర్మాత‌కు తీర‌ని న‌ష్టాన్ని క‌లిగించింది.

Tags:    

Similar News