ఎన్నికల్లో నిర్మాత రూ.కోట్లల్లో బెట్టింగ్.. భారీగా లాస్!
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశారు.
ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా సాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసారి మరింత రసవత్తరంగా జరిగాయి. కొన్ని రోజుల పాటు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తింది. అన్ని పార్టీల నాయకులు కూడా తగ్గేదేలే అంటూ ప్రచారాన్ని నిర్వహించారు. తమను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ఎన్నో హామీలు కురిపించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. గెలుపే ధ్యేయంగా తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు.
అయితే ఫలితాలు కూడా ఎవరూ ఊహించని రీతిలో వచ్చాయి. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. 164 స్థానాలు సొంతం చేసుకున్న కూటమి విజయ కేతనం ఎగురవేసింది. అధికారాన్ని దక్కించుకుంది. టీడీపీ 135 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలుపొంది అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 100 పర్సెంట్ స్ట్రైక్ సాధించిన పార్టీగా నిలిచింది.
ఇక ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా టాక్ వినిపించింది. కొందరు భారీగా నష్టపోగా.. ఇంకొందరు పెద్ద ఎత్తున సంపాదించారని టాక్. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత కూడా భారీగా నష్టపోయినట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. రూ.కోట్లల్లోనే ఆయన లాస్ అయినట్లు టాక్.
తొలుత సదరు నిర్మాత.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ మరోసారి విజయం సాధించనుందని కొంత మొత్తంలో బెట్టింగ్ వేశారట. ఆ తర్వాత ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ కచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుందని అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు! దీంతో వేసిన బెట్టింగ్ కు ఇంకాస్త సొమ్ము జోడించారని తెలుస్తోంది. అలా తక్కువగా పెట్టిన మొత్తాన్ని ఆయనే భారీ మొత్తంగా మార్చారని సమాచారం. అంతా తనదేనని ఆశపడి మరీ పందెం కాశారట!
కానీ చివరకు సీన్ రివర్స్ అయిపోయింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా చతికిలపడింది. మొత్తం 175 స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా అధికారాన్ని కోల్పోయింది. ఇంకేముంది.. భారీ బెట్టింగ్ వేసిన ఆ నిర్మాత మొత్తం లాస్ అయిపోయారట. ఇప్పుడు ఈ విషయంపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారింది. మరి ఆ నిర్మాత ఈ కష్టం నుంచి ఎలా బయటపడతారో.