రెమ్యునరేషనే కాదు.. ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా మస్ట్!

రెమ్యునరేషన్.. ఇదీ సినీ ఇండస్ట్రీలో కామన్ వర్డ్. సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరు పారితోషికం అందుకోవడం సాధారణ విషయమే.;

Update: 2025-04-07 07:38 GMT
రెమ్యునరేషనే కాదు.. ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా మస్ట్!

రెమ్యునరేషన్.. ఇదీ సినీ ఇండస్ట్రీలో కామన్ వర్డ్. సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరు పారితోషికం అందుకోవడం సాధారణ విషయమే. అయితే టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు హీరోల రెమ్యునరేషన్ల మ్యాటర్స్ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఫలానా హీరో.. అంత మొత్తంలో అందుకున్నారని వార్తలు వైరల్ అవుతుంటాయి.

అయితే టాలీవుడ్ బడా హీరోలు భారీ ఎత్తున రెమ్యునరేషన్ అందుకోవడమే కాదు.. సినిమా లాభాల్లో వాటా కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సగం వరకు లాభాలను తీసుకుంటున్నారని సమాచారం. ఒకప్పుడు కొందరు హీరోలు అలా చేసినా.. ఇప్పుడు చాలా మంది అదే ఫాలో అవుతున్నారట.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒకప్పుడు సినిమాల మేకర్స్ లిస్ట్ లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కనిపించేవి. అయితే లాభాల వాటా కాకుండా ఎంతో కొంత తీసుకునేవారని.. ఆ తర్వాత అలా చేయడం లేదని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా.. మొదట్లో తన సినిమాల నిర్మాతల పేర్లలో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఉండేవి.

అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత మొత్తం ప్లాన్ మారిందని సమాచారం. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప 2 కోసం బన్నీ రెమ్యునరేషన్ తీసుకోకుండా మొత్తం లాభాల్లో 27.5% తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అట్లీ మూవీకి మాత్రం పారితోషికమే కేవలం తీసుకుంటున్నారట. మరి త్రివిక్రమ్ మూవీకి అలా కాదట.

గీతా ఆర్ట్స్ బ్యానర్ కు లాభాల వాటా ఉండనుందట. అప్ కమింగ్ జాక్ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ తక్కువ రేట్ కే నిజాం హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిర్మాతలకు చాలా హెల్తీ ఆఫర్ అని అంతా అంటున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మేకర్స్ లిస్ట్ లో కచ్చితంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరు ఉంటుంది. అలా లాభం కూడా!

ప్రభాస్, రామ్ చరణ్.. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్స్ లో సంయుక్త మీనన్.. తన సొంత బ్యానర్ ద్వారా లాభాల వాటా పొందుతూనే రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. డైరెక్టర్స్ లో సుకుమార్, త్రివిక్రమ.. తమ సొంత బ్యానర్లతో సినిమాల లాభాల్లో వాటాలను ఆర్జిస్తున్నారు.

Tags:    

Similar News