పూరి -గోపీచంద్ సమ్మర్ తర్వాత?
తాజాగా ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. స్టోరీ లాక్ అవ్వడంతో సమ్మర్ తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట.
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగగా మళ్లీ మ్యాచో స్టార్ గోపీచంద్ ని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఫాంలో ఉన్న స్టార్ హీరోలతో పూరితో సినిమా చేయడం అన్నది అసాధ్యం. ఈ విషయం ఆయన కూడా అర్దం చేసుకుని అలాంటి ప్రయత్నం చేయకుండా గోపీచంద్ ని తెరపైకి తెస్తున్నట్లు బలమైన ప్రచారం జరిగింది.
తాజాగా ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. స్టోరీ లాక్ అవ్వడంతో సమ్మర్ తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకి కూడా పూరి కేవలం స్టోరీ..డైలాగ్ లు మాత్రమే రాసుకుని ముందుకెళ్తున్నాడు. పూరి స్క్రీన్ ప్లే రాయడం అన్నది తొలి నుంచి అలవాటు లేదు. మధ్యలో అవసరం అనుకున్న కొన్ని సినిమాలకు రాసుకున్నాడు. గత మూడు నాలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే రాసాడు.
కానీ గోపీచంద్ చిత్రానికి మాత్రం పాత పద్దతినే అనుసరిస్తున్నాడట. ఈ చిత్రాన్ని ఓ యువ నిర్మాత నిర్మించ డానికి ముందుకొచ్చాడట. ప్రస్తుతం పూరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు గోపీచంద్ 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డితో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్టోరీ లాక్ అయినట్లు శ్రీనివాస్ చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పూరి సినిమా తో పాటు గోపీచంద్ ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే అవకాశం ఉంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాల్సి ఉంది. గోపీచంద్ కూడా కొంత కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. మార్కెట్ డౌన్ అవ్వడంతో ప్లాప్ డైరెక్టర్లతో జత కట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.