పూరి మళ్లీ అదే మిస్టేక్ రిపీట్ చేయబోతున్నాడా?
తీసిన సినిమా మళ్లీ తిప్పి తీసాడని విమర్శలు ఎదుర్కున్నాడు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ సినిమాల ట్రెండ్ మారి చాలా కాలమవుతోంది. కథల విషయంలో ఇప్పుడెంతో అప్ డేట్ గా ఉంటున్నారంతా. మాస్ స్టోరీలతో హిట్లు కొట్టేదాం అనుకుంటే అది కలే. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వైఫల్యం అవ్వడానికి కారణం అదే. పూరి కథల్లో పసలేదని..ఆయన ఇంకా పాత పార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నాడని చాలా కాలంగా విమర్శలున్నాయి. దీంతో పూరి కూడా ఓ సందర్భంలో కథలుంటే ఇవ్వండి అంటూ ఓపెన్ అయిన సందర్భం ఉంది.
ఈ క్రమంలో వక్కంతం వంశీ ఇచ్చిన కథతో `టెంపర్` తెరకెక్కించారు. అది హిట్ అయింది. ` టెంపర్` తర్వాత పూరి తొమ్మిది సినిమాలు చేసాడు. అందులో `జ్యోతిలక్ష్మి` యావరేజ్ గా ఆడింది. ` ఇస్మార్ట్ శంకర్` హిట్ అయింది. మిగిలిన ఏడు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. `ఇస్మార్ట్ శంకర్` హిట్ అయిందని ఆ సినిమాకి సీక్వెల్ చేసి చేతులు కూడా కాల్చుకున్నాడు.
తీసిన సినిమా మళ్లీ తిప్పి తీసాడని విమర్శలు ఎదుర్కున్నాడు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఇద్దరు `గోలీమార్` తో యావరేజ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ `గోలీ మార్` కి సీక్వెల్ అంటే పూరి మళ్లీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నట్లే.
`గోలీమార్` బ్లాక్ స్టోరీ సినిమా కాదు. అలాంటి కథ కాదు. అదోక రొటీన్ సినిమా. పూరి బ్రాండ్ తో యావరేజ్ గా ఆడింది. ఆ సినిమాకి సీక్వెల్ అంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదన్న విమర్శ వ్యక్త మవుతుంది. పూరికి అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవడం మంచిదంటున్నారు విశ్లేషకులు.