సేతుపతితో పూరి సొంత బ్రాండ్ కాదా?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ సినిమా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.;

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ సినిమా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్ ల్లో ఉన్న పూరి తన ట్యాలెంట్ తో విజయ్ ని మెప్పించాడని...ఇది పూరి శైలికి భిన్నమైన చిత్రమని వెలుగులోకి వచ్చింది. స్టోరీలో యూనిక్ నెస్ నచ్చడంతోనే విజయ్ ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్లాప్ ల్లో ఉన్న పూరికి విజయ్ ఒకే చెప్పడం ఏంటని కొన్ని విమర్శలు కూడా వ్యక్తమైనా? పూరి గత సక్సెస్ లు..ఆయన ట్రాక్ రికార్డు...తాజాగా వినిపించిన స్టోరీ భిన్నమైంది కావడంతో ఇంతవరకూ వచ్చిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు కథ వేరే ఉందని తాజాగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి పూరి సొంత కథ రాయలేదట. `వేదాళం` సినిమాకు రైటర్ గా పనిచేసిన ఆది నారాయనణ ఓ డిఫరెంట్ స్టోరీ రాసాడట.
ఈ కథను ఎవరు బాగా డీల్ చేయగలరు? అన్న ప్రోసస్ లో లో ఆది నారాయణే పూరి పేరు సూచించారట. దీంతో విజయ్ కూడా మరో ఆలోచన లేకుండా ముందుకెళ్దామని సూచించడంతో? పూరి ని అప్రోచ్ అవ్వడం..ఆయన ఒకే చెప్పడం అంతా వేగంగా జరిగిందని అంటున్నారు. పూరి కథలు కూడా కొంత కాలంగా సక్సెస్ అవ్వని సంగతి తెలిసిందే. చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు.
కానీ మేకర్ గా అతడికంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. ఎంగేజింగ్ గా సినిమా తీయగల దిట్ట. ఈ నేపథ్యంలో విజయ్ కోసం రాసిన కథ పూరి వద్దకు చేరిందని తెలుస్తోంది. విజయ్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుం దంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై ఏ నటుడు పోషించని పాత్ర అని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి కన్పర్మేషన్ లేదు.