పూరి నువ్వుల పొడి అంటే జుర్రేస్తుడుట!
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పని రాక్షసుడు. పని తప్ప మరో ధ్యాష ఉండని మనిషి అని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు ఎంతో మంది చెబుతుంటారు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పని రాక్షసుడు. పని తప్ప మరో ధ్యాష ఉండని మనిషి అని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు ఎంతో మంది చెబుతుంటారు. టైమ్ కి తినడం..పడుకోవడం అంటే నచ్చని వ్యక్తి అంటుంటారు. కడుపుకు ఆకలేసినా మితంగా తింటాడు. ఆకలి తీరా తీనే రకం కాదు. ఆకలి ఎంత ఎక్కువగా ఏస్తే అంతకంతకు ఓ ముద్దు తినడం తగ్గించుకునే రకం పూరి. కర్రీ బాగుందని ఓ ముద్దు ఎక్కువ తిందా మని అంతా అనుకుంటారు. కానీ పూరి అప్పుడే ఓ ముద్దు తక్కువ తినాలి అనుకుంటాడు.
ఇలా చేయడం వల్ల కసి పట్టుదల పెరుగుతుందని..విల్ పవర్ కి ఆస్కారం ఉంటుందని పూరి నమ్ముతాడు. మరి అలాంటి పూరి ఇష్టంగా తినే ఆహారం ఏదైనా ఉంటుందా? అంటే చెప్పడం కష్టమే. తిండే సరిగ్గా తిననోడికి ఇష్టమైన వంటకాలు ఏమి ఉంటాయి...ఏమీ ఉండవు. నిజానికి పూరి ఇష్టపడే తిన వంటకాల గురించి కూడా ఇప్పటివరకూ ఎక్కడా వెలుగులో రాలేదు. తొలిసారి పూరి తల్లి ఆ విషయాన్ని రివీల్ చేసారు.
పూరి ఇష్టం తినే వంటకం కొన్ని ఉన్నాయి. అవి ఒకటి నవ్వుల పొడి...పచ్చళ్లు..ఇంకా కొన్ని రకాల పొడులు కాస్త ఎక్కువగా తింటాడుట. నాన్ వెజ్ తినడం చాలా రేర్ అట. అది అంత ఇష్టంగా తినరుట. కర్రీల విషయంలో అలా ఉండాలి? ఇలా ఉండాలి? అనరుట. ఆ పూట గడిస్తే చాలు అనుకుంటాడుట. ఇక అమ్మ చేతి నువ్వుల పొడి అంటే ఇష్టంగా తింటాడుట. అన్నంలో ఆయిల్ ..నువ్వుల పొడి కలుపుని తినడం చిన్నప్పటి నుంచి అలవాటు అట. ఇప్పటికీ అలాగే తింటాడుట.
పూరి కోసం ప్రత్యేకంగా వాటిని తయారు చేయించి పంపిస్తుందిట. కానీ అమ్మ చేతి నువ్వుల పొడి రుచి..భార్య చేతికి రావడం లేదని అంటాడుట. అమ్మ రోట్లో వేసి దంచితే ఆ టేస్ట్ వచ్చిందని...భార్య లావణ్య మాత్రం మిక్సీ చేస్తే ఎలా వస్తుందని లావణ్య గుసాయించిన సందర్భం కూడా ఉందంటండోయ్. అలాగే అమ్మ చేతి చేగోడీలు కూడా బాగానే తింటాడుట. పూరి ముంబైలో ఉన్నప్పుడు జాన్వీ కపూర్..ఖషీ కపూర్ కూడా నవ్వుల పొడి రుచి చూసారుట. కారం ఎక్కువగా ఉన్నా అక్కా చెల్లి ఇద్దరు ఇష్టంగా లాగించే సారుట. ఆ డబ్బా మొత్తం ఓ పూటకే ఖాళీ చేసారుట. అదీ పూరి నవ్వుల పొడి కహానీ.