కన్నడంలో పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్
ఓవరాల్ గా కర్ణాటకలో 'పుష్ప 2' మూవీ అన్ని భాషలలో కలిపి 50 కోట్లు క్రాస్ చేసింది. హిందీ, తెలుగు, ఓవర్సీస్ తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది కర్ణాటక నుంచే కావడం విశేషం.
'పుష్ప 2' మూవీ వరల్డ్ వైడ్ గా ఆరు భాషలలో రిలీజ్ అయ్యింది. సౌత్ లో తెలుగుతో పాటు మిగిలిన మూడు భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాలలో నిర్వహించారు. దీంతో తెలుగులో 16వ రోజు ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇక హిందీలో 645 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. తమిళనాట నాట కూడా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక మలయాళంలో 13 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
ఇలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. కన్నడ భాషలో కూడా 'పుష్ప 2' సినిమాకి ఏకంగా 8.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కన్నడ భాషలలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా అల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఏ చిత్రం కన్నడ భాషలో డబ్బింగ్ సినిమాగా వచ్చి ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించలేదు. 'పుష్ప 2'కి ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే కన్నడ భాషలో కూడా ఈ సినిమా 8 కోట్ల క్లబ్ లో చేరింది.
ఓవరాల్ గా కర్ణాటకలో 'పుష్ప 2' మూవీ అన్ని భాషలలో కలిపి 50 కోట్లు క్రాస్ చేసింది. హిందీ, తెలుగు, ఓవర్సీస్ తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది కర్ణాటక నుంచే కావడం విశేషం. కర్ణాటకలో తెలుగు భాషలోనే ఎక్కువ మంది ఈ సినిమాని వీక్షించారు. కన్నడ భాషలో కూడా 8 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం ద్వారా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే 'పుష్ప 2' జోరు మున్ముందు ఇంకా ఉండొచ్చని అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. మేకర్స్ అయితే 1700 కోట్ల వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు. ట్రేడ్ పండితులు మాత్రం 1600 కోట్లు రీచ్ అవ్వొచ్చని భావిస్తున్నారు. హిందీలో ఈ సినిమా ఎంత కాలం వసూళ్ల పర్వం కొనసాగిస్తుందనే దానిని బట్టి ఈ లాంగ్ రన్ వసూళ్లు ఆధారపడి ఉంటాయని అనుకుంటున్నారు.
'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తూ ఉండటంతో భవిష్యత్తులో అల్లు అర్జున్ నుంచి రాబోయే అన్ని సినిమాలు 1000 కోట్లకి పైగానే వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.