పుష్ప 2: ఆ భాషలో మాత్రం ఊహించని లాస్!

సినిమా అక్కడ మొత్తం 52 కోట్ల బిజినెస్‌ చేసినప్పటికీ, రన్ పూర్తయ్యే సమయానికి కేవలం 34.86 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.

Update: 2025-01-28 10:39 GMT

ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ నెంబర్ పాన్ ఇండియా స్టార్స్ లో ఒకరిగా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. "పుష్ప 2" ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం షాకింగ్. ఇక హిందీలోనే అత్యధిక లాభాలు వచ్చాయి. నార్త్ లెక్క దాదాపు 800 కోట్లు దాటేసింది. అయితే, తమిళనాడులో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయి వసూళ్లను సాధించలేకపోయింది.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. అయితే, తమిళనాడు మార్కెట్‌లో పుష్ప 2 కు ఎదురైన వాస్తవ పరిస్థితులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో పుష్ప 2 భారీ అంచనాల నడుమ విడుదలైంది. సినిమా మార్కెట్‌కు అనుగుణంగా మంచి ప్రమోషన్స్ కూడా నిర్వహించారు.

తమిళంలో 52 కోట్ల బిజినెస్ టార్గెట్ తో రిలీజైన ఈ సినిమా మొదటి రోజుల్లో ఆకర్షణీయమైన ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కానీ, లాంగ్ రన్‌లో సినిమా అనుకున్న స్థాయిలో కొనసాగలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం వలన వసూళ్లకు దెబ్బతగిలింది. సినిమా అక్కడ మొత్తం 52 కోట్ల బిజినెస్‌ చేసినప్పటికీ, రన్ పూర్తయ్యే సమయానికి కేవలం 34.86 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.

ఈ వసూళ్లను చూస్తే, సినిమా మొత్తం 80.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని చెప్పవచ్చు. ఇక బిజినెస్ లో 17.14 కోట్ల నష్టాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. బయ్యర్లకు కొంతవరకు నిరాశకరంగా మారింది. కేరళలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ లభించలేదు. అక్కడ కూడా సినిమా బాక్సాఫీస్ పరుగును చాలా త్వరగా ముగించుకున్నట్లు చెబుతున్నారు.

అయితే, మిగిలిన రాష్ట్రాల్లో సినిమా ఎపిక్ కలెక్షన్లతో సంచలన విజయం సాధించడం వల్ల ఈ రెండు ఏరియాల్లో వచ్చిన నష్టాలను రికవరీ చేయగలిగింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో, నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. తమిళనాడు, కేరళల్లో "పుష్ప 2" అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా, ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ అది ఎంతటి మాస్ అపీల్ కలిగిన చిత్రమో చెబుతోంది. సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, అల్లు అర్జున్ నటన, ఇవన్నీ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చాయి.

Tags:    

Similar News