పుష్ప రాజ్… ఆ రికార్డు సాధ్యమేనా?
ముఖ్యంగా చైనాలో ఎర్ర చందనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చైనాలో 'పుష్ప 2' లాంటి మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ 'పుష్ప 2' వరల్డ్ వైడ్ గా 1830 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. విడుదలై నెల రోజులు దాటినా కూడా ఇప్పటికి ఈ మూవీ థియేటర్స్ లో నిలకడగా వసూళ్లని అందుకుంటూ కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం మేగ్జిమమ్ ఈ సినిమాలు కలెక్షన్స్ క్లోజింగ్ కి చేరుకున్నాయి. మరో మూడు రోజుల్లో 'గేమ్ చేంజర్' రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ సినిమా వైపు వెళ్తోంది.
ఇండియన్ డొమెస్టిక్ బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం దేశంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'పుష్ప2'నే ఉంది. దీని తర్వాత స్థానంలో 'బాహుబలి 2' నిలిచింది. 'దంగల్' మూవీ ఓవరాల్ గా 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన కూడా వాటిలో 1450 కోట్ల వరకు చైనా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు అయినవే కావడం విశేషం. అమీర్ ఖాన్ చేసిన 'సీక్రెట్ సూపర్ స్టార్', 'దంగల్' సినిమాలు రెండు కూడా చైనాలో భారీ కలెక్షన్స్ ని వసూళ్లు చేశాయి.
వీటి స్థాయిలో ఏ ఇండియన్ మూవీ కూడా చైనా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సాధించలేకపోయింది. 'బాహుబలి 2'కి కూడా చైనాలో 80 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా చైనాలో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటింది. 'పుష్ప 2' సినిమాని చైనా, జపాన్ భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. అదే జరిగితే అక్కడ కూడా పుష్ప 2కి మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా చైనాలో ఎర్ర చందనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చైనాలో 'పుష్ప 2' లాంటి మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్కడ ఈ మూవీ క్లిక్ అయితే మాత్రం 'దంగల్' సినిమా రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'దంగల్' మూవీ కలెక్షన్స్ ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా అది సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు.
ఆ తరువాత 'పుష్ప 2' రికార్డ్ ని బ్రేక్ చేయడానికి కనీసం రెండు, మూడేళ్ళయిన పట్టే అవకాశం ఉంటుంది. మరల తెలుగు సినిమానే 'పుష్ప 2', 'దంగల్' రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందని ట్రేడ్ పండితులు సైతం నమ్ముతున్నారు. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో పాటు 'కల్కి 2898ఏడీ', 'స్పిరిట్', 'సలార్ 2' సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ చిత్రం 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందనేది చూడాలి.