పుష్ప 2 : నార్త్‌లో షేరింగ్ లొల్లి
కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే వారు, ఎగ్జిబ్యూట్ చేసే వారు భారీ లాభాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ నార్త్ ఇండియా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సౌత్‌లో సింగిల్ స్క్రీన్‌లు తక్కువ అయ్యి మల్టీప్లెక్స్‌లు ఎక్కువ అయ్యాయి. కానీ నార్త్‌లో మాత్రం ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లదే హవా అనే విషయం తెల్సిందే. అందుకే పుష్ప పార్ట్ 1 సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల రేట్లకు భయపడి చాలా మంది సినిమాలు చూడటమే మానేసిన ఈ రోజుల్లోనూ నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండటం మంచి పరిణామం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పుష్ప 2 సినిమాను అత్యధిక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో విడుదల చేయబోతున్నారు.
సాధారణంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్‌లో ఒక సినిమాను స్క్రీనింగ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్‌కి, ఎగ్జిబ్యూటర్‌కి 50-50 షేర్ దక్కుతుంది. కానీ ఈసారి పుష్ప 2 కి అలా కాదని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మధ్య గొడవ మొదలైంది. 60-40 చొప్పున లాభాల్లో వాటాను తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ మధ్య చర్చ జరుగుతోంది. ఈ చర్చ వల్ల ఇప్పటి వరకు చాలా ఏరియాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాలేదు. డిసెంబర్ 4వ తారీకు వరకు ఈ పంచాయితీ తెగక పోవడంతో అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టలేదని తెలుస్తోంది.
నేడు సాయంత్రం వరకు వివాదం ఒక కొలిక్కి వచ్చి అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా సింగిల్ స్క్రీన్ నుంచి రాబట్టే వసూళ్లు మెజార్టీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే వారు, ఎగ్జిబ్యూట్ చేసే వారు భారీ లాభాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ నార్త్ ఇండియా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ ఎత్తున వసూళ్లు సాధించబోతున్న పుష్ప 2 సినిమాతో సాధ్యం అయినంత ఎక్కువ లాభాలను దక్కించుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ షేరింగ్ లొల్లి మొదలు పెట్టి ఉంటారు అనేది టాక్.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా నార్త్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్, సినిమా స్థాయి నేపథ్యంలో అక్కడ రూ.500 కోట్లకు మించి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకున్న బాహుబలి 2 , దంగల్ రికార్డ్‌లను బ్రేక్ చేసే విధంగా పుష్ప 2 దూకుడు ఉంది. మరి ఆ ఆల్ టైమ్ రికార్డ్‌లను పుష్ప 2 టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.