ముంబై గడ్డపై పుష్ప రాజ్ డామినేషన్.. టాప్ 10 లిస్ట్

ముంబై మార్కెట్‌లో తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ఈ సినిమా, బాహుబలి 2 వంటి చిత్రాల రికార్డును కూడా అధిగమించింది.

Update: 2025-01-24 00:30 GMT

తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా తెలియజేసిన సినిమాల్లో పుష్ప సిరీస్ ఇప్పుడు మరింత అద్భుతమైన రికార్డులతో చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన పుష్ప 2 హిందీ మార్కెట్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా ముంబై టెర్రిటరీలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ముంబై మార్కెట్‌లో పుష్ప 2: ది రూల్ 267 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి టాప్‌లో నిలిచింది. ఇది ఒక తెలుగు సినిమాకు కేవలం హిందీ మార్కెట్‌లో సాధించిన గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు.

ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 కలెక్షన్లు 1800 కోట్ల మార్క్‌ను దాటడం ద్వారా తెలుగువారి ప్రతిభను మరోసారి నిరూపించింది. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం 830 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి పాన్ ఇండియా సినిమాల్లో మరో టాప్ రికార్డు ను అందుకుంది. అల్లుఅర్జున్ నటనతో పాటు సుకుమార్ మేకింగ్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌గా నిలిపాయని చెప్పవచ్చు.

ముంబై మార్కెట్‌లో తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ఈ సినిమా, బాహుబలి 2 వంటి చిత్రాల రికార్డును కూడా అధిగమించింది. బాహుబలి 2 ముంబైలో 182.56 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, పుష్ప 2 దాన్ని దాటేసింది. హిందీ సినిమాలైన జవాన్, గదర్ 2, పఠాన్ వంటి బిగ్ హిట్స్‌ని కూడా ఈ సినిమా వెనక్కు నెట్టడం విశేషం.

ఇక ఈ లిస్ట్‌లో కేజీఎఫ్ 2, తానాజీ వంటి ఇతర చిత్రాలు కూడా ఉన్నప్పటికీ, పుష్ప 2 సాధించిన స్థాయి వేరు. బాహుబలి 2 తర్వాత తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా పుష్ప 2 కావడం విశేషం. అసలు సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. మొదట పుష్ప 1 ఇచ్చిన బూస్ట్ తోనే మేకర్స్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యారు. ఇక హీరో అల్లు అర్జున్ క్రేజ్ కూడా ఈ సినిమాతో మరో లెవెల్ కు వెళ్ళింది.

ముంబై టెర్రిటరీ టాప్ 10 చిత్రాల కలెక్షన్స్ లిస్ట్ ఇలా ఉంది

1. పుష్ప 2 - ₹267 కోట్లు

2. బాహుబలి 2 - ₹182.56 కోట్లు

3. స్త్రీ 2 - ₹159 కోట్లు

4. కేజీఎఫ్ చాప్టర్ 2 - ₹145.45 కోట్లు

5. గదర్ 2 - ₹143.98 కోట్లు

6. తానాజీ - ₹143.85 కోట్లు

7. జవాన్ - ₹140.05 కోట్లు

8. యానిమల్ - ₹139.89 కోట్లు

9. పఠాన్ - ₹135.52 కోట్లు

10. దంగల్ - ₹104.26 కోట్లు

Tags:    

Similar News