పుష్ప-2.. అక్కడలా ఇక్కడిలా

తొలి వీకెండ్లోనే అండర్ పెర్ఫామ్ చేసిన 'పుష్ప-2' మలయాళ వెర్షన్.. వీక్ డేస్‌లో నిలవలేకపోయింది. రెండో వీకెండ్లో కూడా పెద్దగా పుంజుకోని 'పుష్ప-2' కేరళలో డిజాస్టర్‌గా తేలింది.

Update: 2024-12-17 11:05 GMT

తొలి రోజు కొంచెం డివైడ్ టాక్ వచ్చినా.. తొలి వీకెండ్ భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది 'పుష్ప-2'. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. కానీ దేశవ్యాప్తంగా 'పుష్ప-2' వసూళ్లు ఒకేలా లేవు. హిందీ వెర్షన్ వీక్ డేస్‌లోనూ దూసుకెళ్తుంటే.. సౌత్ ఇండియాలో మాత్రం 'పుష్ప-2' తడబడుతూ సాగుతోంది. అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న కేరళలో 'పుష్ప-2' డిజాస్టర్ కావడం పెద్ద షాక్. ఈ సినిమాను కేరళలో గట్టిగానే ప్రమోట్ చేశాడు బన్నీ. ఈ సినిమాలో మలయాళం లిరిక్స్‌తో ఒక పాట కూడా పెట్టాడు. కానీ అదేమీ పెద్దగా ప్రభావం చూపించలేదు.

తొలి వీకెండ్లోనే అండర్ పెర్ఫామ్ చేసిన 'పుష్ప-2' మలయాళ వెర్షన్.. వీక్ డేస్‌లో నిలవలేకపోయింది. రెండో వీకెండ్లో కూడా పెద్దగా పుంజుకోని 'పుష్ప-2' కేరళలో డిజాస్టర్‌గా తేలింది. పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయలేదు. తమిళనాట 'పుష్ప-2' ఫస్ట్, సెకండ్ వీకెండ్స్‌లో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అక్కడ కూడా సినిమా చల్లబడిపోయింది. కర్ణాటకలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'పుష్ప-2' పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. చాలా ఏరియాల్లో రికవరీ 60-70 శాతం మధ్యే ఉంది. 'పుష్ప-1' సైతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. హిందీ వెర్షన్ అనూహ్యంగా పెద్ద హిట్టయిపోవడంతో ఓవరాల్‌గా ఇది సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. పుష్ప-2 విషయంలోనూ దాదాపు ఇదే జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ టార్గెట్లను అందుకోలేకపోతోంది. అధిక టికెట్ ధరలు ఓపెనింగ్స్‌కు ఉపయోగపడినా.. ఓవరాల్‌గా ఆక్యుపెన్సీలను తగ్గించేశాయి. వీక్ డేస్‌లో సినిమా వీకైపోయింది. రెండో వీకెండ్లో బాగానే ఆడిన ఈ చిత్రం.. సోమవారం నుంచి బాగా డల్ అయిపోయింది.

ఇప్పుడు షేర్ నామమాత్రంగా వస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు కొంత నష్టాలు తప్పేలా లేవు. యుఎస్‌లో సైతం హిందీ వెర్షన్ అంచనాలను మించి వసూళ్లు రాబట్టగా.. తెలుగు వెర్షన్ ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటుండడం గమనార్హం. అక్కడ కూడా తెలుగు వెర్షన్ రన్ దాదాపు పూర్తయినట్లే.

Tags:    

Similar News