16Mతో బాహుబలి 2ని క్రాస్ చేసిన 'పుష్ప 2'
పుష్ప 2 సినిమాకు బుక్ మై షో లో మొదటి వారం రోజులు గంటకు లక్షకు పైగా టికెట్లు నమోదు అయ్యి రికార్డ్ నమోదు అయిన విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది. ఇప్పటికే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1400 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా సాధించబోతున్న నెంబర్‌పై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం కలెక్షన్స్ విషయంలో నెం.3లో ఉన్న పుష్ప 2 త్వరలోనే నెం.2 కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షో ద్వారా ఈ సినిమా టికెట్లు ఇప్పటి వరకు 16 మిలియన్‌లు బుక్ అయ్యాయి. బాహుబలి 2 కంటే ఇది అధికం. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 తర్వాత స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. ఇప్పుడు ఆ స్థానంను పుష్ప 2 దక్కించుకుని తన హవాను కొనసాగిస్తూ ఉంది.
పుష్ప 2 సినిమాకు బుక్ మై షో లో మొదటి వారం రోజులు గంటకు లక్షకు పైగా టికెట్లు నమోదు అయ్యి రికార్డ్ నమోదు అయిన విషయం తెల్సిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా గంటకు లక్ష అంతకు మించి టికెట్లు బుక్ కావడంతో బుక్ మై షో రికార్డ్‌లు బద్దలు అయ్యాయి. ఇప్పుడు ఏకంగా 16 మిలియన్‌ల టికెట్లు ఇప్పటి వరకు బుక్ అయ్యాయి. సినిమా ఇంకా థియేటర్‌లో కొనసాగుతోంది. నార్త్ ఇండియాలో సినిమా ఓ రేంజ్‌లో దూసుకు పోతుంది. కనుక ముందు ముందు మరిన్ని రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కేజీఎఫ్ 2 సినిమా బుక్ మై షో లో లాంగ్ రన్ లో 17.7 మిలియన్‌ల టికెట్లు అమ్ముడు పోయాయి. ఆ రికార్డ్ బ్రేక్ కావాలంటే మరో 1.5 మిలియన్‌ల టికెట్లు బుక్ మై షో ద్వారా పుష్ప 2 కి అమ్ముడు పోవాలి. సినిమా లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకుంటే కచ్చితంగా ఆ రికార్డ్‌ను కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వసూళ్ల విషయంలో కేజీఎఫ్ 2 సినిమా టికెట్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన పుష్ప 2 బుక్ మై షో లో ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. నెం.1 సినిమాగా నిలవడం కచ్చితంగా సాధ్యమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా నటించినందుకు గాను అల్లు అర్జున్ రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్న విషయం తెల్సిందే. సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు రష్మిక రూ.10 కోట్లు, ఐటెం సాంగ్ చేసినందుకు గాను శ్రీలీల రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంది. ఈ సినిమాతో నిర్మాతలకు మాత్రమే కాకుండా అన్ని భాషల డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా లాభాలు దక్కబోతున్నాయి అంటున్నారు. థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత వసూళ్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.