తడిసి మోపిడైన పుష్ప2 బడ్జెట్.. అసలు కారణం అదే..

అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబోలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2’షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Update: 2024-10-08 16:30 GMT

పుష్ప మూవీ తో అల్లు అర్జున్ తన రేంజ్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ స్థాయికి పెంచుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవడం తో ఒక్కసారిగా అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ బాగా పెరిగింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా విడుదల కావాల్సిన పుష్ప 2 చిత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే విపరీతంగా పెరిగిపోయింది అని టాక్.. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పదండి.

అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబోలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2’షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ను మూడు యూనిట్లు వేరువేరు ప్రాంతాలలో షూటింగ్ నిర్వహిస్తున్నాయి. వైజాగ్,యానాం, రంపచోడవరం ప్రాంతాలలో వేరువేరు షూటింగ్ సెట్స్ లో పని చక చక సాగుతోంది. కొన్ని కీలక సన్నివేశాల వరకు సుకుమార్ పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతుండగా.. ప్యాచ్ వర్క్ సూట్స్ అన్ని ఆయన టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ చివరికి ఈ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్ పూర్తి అయితే సినిమా దాదాపుగా ఫినిష్ అయినట్టు లెక్క. నిజానికి పుష్ప విడుదలైన ఒకటిన్నర సంవత్సరంలోపే పుష్ప 2 విడుదల కావలసి ఉంది. అయితే మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ను సుకుమార్ చాలావరకు చేంజ్ చేశారట.. పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలి అనే ఉద్దేశంతో కాస్త టైం తీసుకుని కొన్ని మార్పులను చేపట్టారు.

అందుకే మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సుమారు సంవత్సరం పాటు సాగింది. అయితే 2024 ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలవుతుందని జోరుగా ప్రచారం సాగింది. అప్పటికే ఇంకా చాలా వరకు షూటింగ్ పెండింగ్ ఉండడంతో చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఏ మూవీకి హీరో తో సహా మిగిలిన అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వారి పారితోషకాలు కూడా అదనంగా పెరిగాయి. ఇక వీటితో పాటుగా సెట్ వర్క్, ప్రొడక్షన్ ఖర్చులు.. షూటింగ్ రోజువారీ ఖర్చులు ఇలా పెరుగుతూ పోవడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మొదట ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ 300 కోట్ల నుంచి 400 కోట్ల మధ్యలో ఉండగా.. ఇప్పటికే దాదాపు 500 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్.. ఇతర ఖర్చులు అదనంగా ఉండనే ఉన్నాయి.. దీంతో ఇప్పుడు పుష్ప 2 విడుదల కంటే కూడా దానిపై పెట్టిన బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News