17 రోజులు 17.27 మిలియన్ బుకింగ్స్.. ఇది పుష్ప 2 ర్యాంపేజ్..!
ఇక లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా మరో రికార్డు నెలకొల్పింది. సినిమా 17 రోజుల్లో ఏకంగా హైయెస్ట్ బుకింగ్స్ తో సెన్సేషన్ అనిపించుకుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజై 17 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా 1500 కోట్లు దాటి బీభత్సం సృష్టిస్తుంది. బాలీవుడ్ ఈ సినిమా వసూళ్ల హంగామా నెవర్ బిఫోర్ రికార్డులను కొల్లగొడుతుంది. ఇక లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా మరో రికార్డు నెలకొల్పింది. సినిమా 17 రోజుల్లో ఏకంగా హైయెస్ట్ బుకింగ్స్ తో సెన్సేషన్ అనిపించుకుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బుక్ మై షో బుకింగ్స్ లో రేర్ రికార్డ్ సృష్టించింది. 17 రోజుల్లో ఏకంగా 17.27 మిలియన్ బుకింగ్స్ తో ఇదివరకు ఏ సినిమా కూడా సృష్టించని రికార్డ్ ను క్రియేట్ చేసింది. పుష్ప 2 ముందు వరకు కన్నడ సినిమా కె.జి.ఎఫ్ 2 మాత్రమే 17.01 మిలియన్ బుకింగ్స్ తో బుక్ మై షో లో రికార్డ్ సృష్టించగా ఇప్పుడు దాన్ని పుష్ప 2 కేవలం 17 రోజుల్లో బ్రేక్ చేసింది. పుష్ప 2 బుక్ మై షో రికార్డ్ సరికొత్త సంచలనాలు సృష్టించింది.
సినిమా ఆడియన్స్ కు ఎంత నచ్చేసింది అన్నది ఈ రికార్డ్ బుకింగ్స్ చూసైనా అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ మార్క్ టేకింగ్ తో పాటు అల్లు అర్జున్ నట విశ్వరూపం సినిమాను ఈ స్థాయిలో నిలబెట్టేలా చేశాయి. పుష్ప 2 సినిమా ఈ సక్సెస్ కి సినిమాకు పనిచేసిన అందరు వారి బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ గా చెప్పుకునే అంశమని చెప్పొచ్చు.
పుష్ప 2 సినిమా లో రష్మిక గ్లామర్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 1 సినిమా కొనసాగింపుగా వచ్చిన పుష్ప 2 తన ఊర మాస్ యాటిట్యూడ్ తో అదరగొట్టాడు. సినిమాలో పుష్ప రాజ్ పూనకాల పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ అంతా పిచ్చెక్కిపోయారు. ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ కి అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చేశాడు. సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న పుష్ప 2 100 ఏళ్ల సినీ చరిత్రలో ఏ సినిమా సృష్టించని రికార్డులను అందుకుంటుంది. ఫుల్ రన్ లో పుష్ప 2 మరో సినిమా టచ్ చేయాలన్నా కూడా షేక్ అయ్యేలా రికార్డులు సెట్ చేసేలా ఉంది.