పుష్ప-2 ఓవర్సీస్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

పుష్ప-2.. ఈ సారి వైల్డ్ ఫైర్.. అసలు తగ్గేదేలే అంటూ థియేటర్లలో డిసెంబర్ 5వ తేదీన సందడి చేయనున్నారు.

Update: 2024-12-02 16:26 GMT

పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మ్యానియా కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న పుష్ప 2: ది రూల్ తో మేజిక్ చేసేందుకు మళ్లీ సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్. పుష్ప-2.. ఈ సారి వైల్డ్ ఫైర్.. అసలు తగ్గేదేలే అంటూ థియేటర్లలో డిసెంబర్ 5వ తేదీన సందడి చేయనున్నారు.

అయితే పుష్ప-2 సినిమాను వరల్డ్ వైడ్ గా 12 వేల స్క్రీన్స్ లో మేకర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ లో 5 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను ప్రముఖ ప్రత్యంగిరా సినిమాస్, AA సినిమాస్ సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయని సమాచారం.

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతున్నాయి. అయితే విదేశాల్లో పుష్ప సీక్వెల్ ప్రీ సేల్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో ఓవర్సీస్ లో అత్యంత వేగంగా 50 వేల టికెట్స్ సేల్ అయిన చిత్రంగా పుష్ప 2 ఇప్పటికే సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అదే సమయంలో ఓషియానియాలో 700 డాలర్లు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ అందుకోని రికార్డును తాజాగా దక్కించుకుంది. ఇప్పటికీ అనేక దేశాల్లో జోరుగా ప్రే సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రీమియర్లతో పాటు ఫస్ట్ డే కోసం ప్రీ సేల్స్ ద్వారా 3.383 మిలియన్ల డాలర్లను రాబట్టింది పుష్ప-2. దీంతో అది పెద్ద రికార్డనే చెప్పాలి!

ప్రీ సేల్స్ (ప్రీమియర్స్ + ఫస్ట్ డే) లో నార్త్ అమెరికాలో 2.35 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. రిలీజ్ నాటికి నాలుగు మిలియన్ల డాలర్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గల్ఫ్ లో 140 కోట్ల డాలర్లు రాబట్టిన పుష్ప-2.. యూకే, ఐర్లాండ్ దేశాలు కలిపి 262 కోట్ల డాలర్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది!

ఆస్ట్రేలియాలో 210 కోట్ల డాలర్లు, న్యూజిలాండ్ లో 21 కోట్ల డాలర్లను ప్రీ సేల్స్ ద్వారా కలెక్ట్ చేసింది పుష్ప 2. మిగతా అన్ని దేశాలు కలిపి 300 కోట్ల డాలర్లకు పైగా రాబట్టింది. ఇంకా రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని వసూళ్లను సాధించనుంది. అయితే ఇవి ప్రీమియర్స్, ఫస్ట్ డే లెక్కలు మాత్రమే. మొత్తంగా చూసుకుంటే మరిన్ని వసూళ్లు ఉంటాయి. దీంతో పుష్ప-2.. ఓవర్సీస్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా రికార్డులు సాధించడం పక్కా.

Tags:    

Similar News