పుష్ప 2 హిందీ బాక్సాఫీస్.. సోమవారం కూడా అదే బీభత్సం
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్, హిందీ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్, హిందీ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.370 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి, భారీ రికార్డులను బద్దలు కొడుతోంది. 7వ రోజులోనే రూ.350 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉండగా, తొలి వారంలోనే రూ.390 కోట్లకు చేరే అవకాశం ఉంది. పుష్ప 2 సిటీలలోని మల్టీప్లెక్సులు, మాస్ సెంటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను రాబడుతోంది.
హిందీ బెల్ట్‌లో పుష్ప 2కి ముంబై నలువైపుల నుంచి అత్యుత్తమ కలెక్షన్స్ వచ్చాయి. దీని తర్వాత సీపీ, సీఐ, రాజస్థాన్, బిహార్ వంటి మాస్ ప్రాంతాలు ఉన్నాయి. ఈస్ట్ పంజాబ్ కూడా అద్భుతమైన బిజినెస్‌ను నమోదు చేసింది. హిందీ బాక్సాఫీస్‌లో దాదాపు అన్ని ప్రాంతాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతున్నాయి. అయితే ఢిల్లీ యూపీ ప్రాంతంలో మాత్రం స్వల్పంగా తక్కువ వసూళ్లు నమోదయ్యాయి.
పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే సుల్తాన్ (రూ.301 కోట్లు), బజరంగి భాయిజాన్ (రూ.315.50 కోట్లు), సంజు (రూ.334.50 కోట్లు) వంటి బ్లాక్‌బస్టర్ల టోటల్ వసూళ్లను అధిగమించింది. 7వ రోజుతో టైగర్ జిందా హై (రూ.339 కోట్లు) ను కూడా దాటనుంది. తొలి వారంలోనే దంగల్ (రూ.374.50 కోట్లు) వసూళ్లను అధిగమించి, తర్వాత పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన కేజీఎఫ్ 2, బాహుబలి 2, పఠాన్, గదర్ 2, జవాన్ వంటి సినిమాల రేంజ్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ప్రారంభం నుంచే అత్యధిక వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తుంటే, పుష్ప 2 హిందీలో రూ.600 కోట్ల క్లబ్‌లో చేరి, ఆ తర్వాత రూ.700 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ సక్సెస్‌కు 2వ సోమవారం కలెక్షన్లు కీలకం కానున్నాయి.
గురువారం - 72 కోట్లు
శుక్రవారం - 59 కోట్లు
శనివారం - 74 కోట్లు
ఆదివారం - 86 కోట్లు
సోమవారం - 48 కోట్లు
మంగళవారం: రూ.35 కోట్లు (అంచనా)
మొత్తం: రూ.374 కోట్లు
ప్రస్తుతం హిందీ బాక్సాఫీస్‌లో పుష్ప 2 ఒక సునామీలా మారింది. ఈ సినిమా వసూళ్లు కలుపుకునే దిశగా చూస్తే, పుష్ప 2 భారతీయ చిత్రసీమలో కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పవచ్చు. వరల్డ్ వైడ్ గా టోటల్ లెక్క వెయ్యి కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నుంచి సినిమా ఇంకా ఏ స్థాయిలో వసూళ్ళను రాబడుతుందో చూడాలి.