హిందీలో టాప్ కలెక్షన్స్… పుష్ప 2 నెంబర్ ఎంతంటే?
సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ముఖ్యంగా ‘బాహుబలి 2’ తర్వాత సౌత్ సినిమాలకి అక్కడ ఆదరణ పెరిగింది.
సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ముఖ్యంగా ‘బాహుబలి 2’ తర్వాత సౌత్ సినిమాలకి అక్కడ ఆదరణ పెరిగింది. బలమైన కథ, కథనాలతో వచ్చే సినిమాలని ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. భారీ కలెక్షన్స్ కూడా కట్టబెడుతున్నారు. హీరో బ్రాండ్ ఇమేజ్ కారణంగా సినిమాకి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రావొచ్చు. కానీ లాంగ్ రన్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే మాత్రం కచ్చితంగా కథాబలం ఉండాల్సిందే.
ఈ విషయంలో తాజాగా రిలీజ్ అయిన ‘పుష్ప 2’ మూవీ ప్రూవ్ చేసుకుంది. అందుకే కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇందులో మెజారిటీ కలెక్షన్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చినవే కావడం విశేషం. దీనిని బట్టి అక్కడ ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజా లెక్కల ప్రకారం ఈ మూవీ హిందీలో 400+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది.
డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయ్యి హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ టాప్ 2లోకి వచ్చింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కలెక్షన్స్ ని ఈ మూవీ బీట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో నార్త్ ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న సౌత్ సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో ‘బాహుబలి 2’ ఉంది.
ఈ మూవీ ఏకంగా 510.99 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. రెండో స్థానంలోకి వచ్చిన ‘పుష్ప 2’ ఇప్పటి వరకు 461 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇది కేవలం 9 రోజుల్లోనే వచ్చిన వసూళ్లు. లాంగ్ రన్ లో ‘బాహుబలి 2’ని ఈ చిత్రం బ్రేక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. మూడో స్థానంలో ఉన్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ 434.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నాలుగో స్థానంలో 294.25 కోట్ల కలెక్షన్స్ తో ‘కల్కి 2898ఏడీ’ ఉంది. ఇక టాప్ 5గా చిత్రంగా 274.31 కోట్ల గ్రాస్ తో ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది.
ఓవరాల్ గా చూసుకుంటే హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాల జాబితా ఇలా ఉంది.
బాహుబలి 2: 510.99 కోట్లు
పుష్ప 2: 461 కోట్లు (9 రోజులు) ***
కేజీఎఫ్ 2: 434.70 కోట్లు
కల్కి 2898 ఏడీ: 294.25 కోట్లు
ఆర్ఆర్ఆర్: 274.31 కోట్లు
2.ఓ: 189.55 కోట్లు
సలార్: 153.84 కోట్లు
సాహో: 142.95 కోట్లు
బాహుబలి 1: 118.7 కోట్లు
పుష్ప 1: 108.26 కోట్లు