పుష్ప 2 ఓవర్సీస్ : టాప్ 5లో పుష్ప స్థానం ఎంత?

పుష్ప 2 విజయానికి ప్రధాన కారణం సినిమా మీద ఏర్పడిన భారీ అంచనాలు. అల్లు అర్జున్ పవర్ఫుల్ ఫాలోయింగ్.

Update: 2024-12-09 10:08 GMT
పుష్ప 2 ఓవర్సీస్ : టాప్ 5లో పుష్ప స్థానం ఎంత?
  • whatsapp icon

ఇండియన్ సినిమాల హవా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. ఈ తరుణంలో పుష్ప 2: ది రూల్ ఇప్పుడు ఓవర్సీస్ లో మరో సాలీడ్ రికార్డును అందుకుంది. ఈ సినిమా తన మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు $19 మిలియన్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఓవర్సీస్ మార్కెట్ లో టాప్ 5 ఇండియన్ సినిమాలలో స్థానం పొందింది.

పుష్ప 2 విజయానికి ప్రధాన కారణం సినిమా మీద ఏర్పడిన భారీ అంచనాలు. అల్లు అర్జున్ పవర్ఫుల్ ఫాలోయింగ్. "తగ్గేదే లే" అనే డైలాగ్ తో మొదటి భాగం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక రెండో భాగం కథనంతో పాటు అద్భుతమైన మేకింగ్ ను హైలెట్ చేయడంతో సినిమా మొదటి రోజే భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటికే $19 మిలియన్ వసూలు చేసి, తన లైఫ్ టైమ్ గ్రాస్ $32-35 మిలియన్ వరకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్ మార్కెట్ లో మొదటి నాలుగు రోజుల అత్యధిక వసూళ్ల జాబితాను పరిశీలిస్తే, మొదట స్థానంలో నిలిచిన బాహుబలి 2 $25 మిలియన్లతో ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉంది. దాని తర్వాత జవాన్ $21.6 మిలియన్లతో, పఠాన్ $20.5 మిలియన్లతో, పుష్ప 2 $19 మిలియన్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఐదవ స్థానంలో $18 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ జాబితాలోకి సరికొత్తగా అడుగు పెట్టిన పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమా ప్రభావాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఓవర్సీస్ మార్కెట్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం పుష్ప 2 పవర్ ని బలంగా చూపిస్తుంది. సినిమా సాంకేతిక నైపుణ్యాలు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అలాగే అల్లు అర్జున్ నటన ఈ విజయానికి మూల కారణాలు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు జాతర సీన్ క్లయిమాక్స్ సీన్ కూడా హైలెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఓవర్సీస్ లో తన స్టార్ డమ్ ను మరింత పెంచుకున్నాడు. ఆయన అభినయం స్క్రీన్ ప్రెజెన్స్ ఈసారి అందరికీ మరింత క్లిక్కయ్యింది.

ఇప్పటివరకు ఉన్న డేటాను బట్టి, పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్ లో మరింత స్థిరంగా ఉంటుందని అనిపిస్తోంది. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడమే కాదు, తెలుగుసినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఒక పాన్ ఇండియా సినిమా ఎలా ఉండాలో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా సానుకూల ఫలితాలను అందిస్తోంది.

మొదటి నాలుగు రోజులలో టాప్ ఓవర్సీస్ గ్రాస్ (ఇండియన్ సినిమాలు)

బాహుబలి2 - $25M

జవాన్ - $21.6M

పఠాన్ - $20.5M

పుష్ప 2 ~ $19M

RRR - 18M

Tags:    

Similar News