చైనా, జపాన్, రష్యా లోనూ పుష్ప-2!
అయితే ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ గానూ తీసుకెళ్లే ఆలోచనలోనూ ఉన్నట్లు రివీల్ చేసారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప-2` డిసెంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఎప్పుడు ఎలా రిలీజ్ చేస్తున్నాం? అన్నది కూడా నిన్నటి రోజున నిర్మాతలు క్లారిటీ ఇచ్చేసారు. దీంతో పుష్ప రిలీజ్ విషయంలో ఇంకెలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. ప్రేక్షకాభిమానులుంతా డిసెంబర్ కి రెడీ గా ఉండాల్సిందే. అయితే ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ గానూ తీసుకెళ్లే ఆలోచనలోనూ ఉన్నట్లు రివీల్ చేసారు.
చైనా, జపాన్, రష్యా లాంటి ప్రముఖ దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ భాషలకు సంబంధించి ప్రత్యేకమైన కట్ ని సిద్దం చేసి రిలీజ్ చేస్తామన్నారు. అయితే విదేశాల్లో డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారా? అన్న సందేహం రావడం సహజం. దాన్ని కూడా నిర్మాతలు నివృతి చేసారు. పాన్ ఇండియా రిలీజ్ అనంతరం రెండు..మూడు నెలలు తర్వాత ఆయా భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆయా భాషలకు సంబంధించి ప్రత్యేకమైన వె ర్షన్ సిద్దం చేయాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు..మూడు నెలలు గడువు తీసుకుంటున్నారు. పుష్ప ది రైజ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కింది. మాస్కో ఫిలిం ఫిస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బ్లాక్‌బస్టర్స్ కేటగీరీ కింద ఈ చిత్రాన్ని స్క్రీన్ చేశారు. ఇంకా విదేశీ క్రికెటర్లు..సోషల్ మీడియా కారణంగా సినిమాకి వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కింది.
ఈనేపథ్యంలో ఆ అంశాలన్నింటిని ప్రామాణికంగా తీసుకుని రెండవ భాగాన్ని విదేశాల్లోనూ ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా విదేశాల్లోనూ హిట్ అందుకుంటే బన్నీ పాన్ ఇండియా స్టార్ కాదు..పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్క రిలీజ్ తోనే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.