ఆస్ట్రేలియాలో టాప్ 10 టాలీవుడ్ కలెక్షన్స్.. టాప్ 1కి అతికొద్ది దూరంలో పుష్ప 2
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన పుష్ప 2: ది రూల్ ఆస్ట్రేలియాలో మరో సెన్సేషనల్ రికార్డ్ ను సాధించింది.
తెలుగు సినీ పరిశ్రమపై పాన్ ఇండియా స్థాయి దృష్టి పెరిగిన తర్వాత, విదేశీ మార్కెట్లలో తెలుగు చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మార్కెట్‌లో తెలుగు చిత్రాల వసూళ్లు మునుపెన్నడూ లేని రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన పుష్ప 2: ది రూల్ ఆస్ట్రేలియాలో మరో సెన్సేషనల్ రికార్డ్ ను సాధించింది. కేవలం 46 రోజుల్లోనే ఈ చిత్రం A$4.48 మిలియన్ వసూలు చేసి, ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల్లో రెండో స్థానాన్ని ఆక్రమించింది.
బాహుబలి 2 A$4.49 మిలియన్ వసూళ్లతో ఇప్పటికీ ఆస్ట్రేలియా బాక్సాఫీస్ చరిత్రలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, పుష్ప 2 ఆ స్థాయిని అందుకోవడానికి కేవలం కొద్ది దూరంలోనే ఉంది. ఏదేమైనా ఈ స్థాయికి రావడానికి తక్కువ సమయంలో సాధించడంతో సినిమా సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం చాలా రికార్డులను అధిగమించడమే కాకుండా, తెలుగు సినిమా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచింది.
ఇక ఆస్ట్రేలియా టాప్ 10 జాబితాలో మరో ముఖ్య చిత్రం RRR A$3.6 మిలియన్ వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది. రాజమౌళి విజన్‌కి కీర్తి పతాకాన్ని ఇస్తూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగుదనాన్ని చాటిచెప్పింది. అదే విధంగా, నందమూరి ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలు కల్కి 2898 ఏడీ, సలార్, సాహో కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఇది తెలుగు చిత్రాలకు ఆస్ట్రేలియా మార్కెట్‌లో ఎంత ఆదరణ ఉందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఆస్ట్రేలియాలో తెలుగుదనం ప్రతిష్టను నిలబెట్టిన ఇతర చిత్రాలు బాహుబలి: ది బిగినింగ్, దేవర, ఆదిపురుష్, మరియు మొదటి పుష్ప కూడా వాటికి తగ్గ స్థాయిలో రికార్డులను నెలకొల్పాయి. ఈ చిత్రాలన్నీ ఆస్ట్రేలియా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ఈ టాప్ 10 గ్యాసింగ్ జాబితా చూస్తే, తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఎదుగుతుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పుష్ప 2 మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ వారంలో సినిమా నెంబర్ వన్ రికార్డ్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
టాప్ 10 తెలుగు సినిమాలు ఆస్ట్రేలియా వసూళ్లు (ఆస్ట్రేలియన్ డాలర్లలో):
1. బాహుబలి 2 - A$4.49 మిలియన్
2. పుష్ప 2 - A$4.48 మిలియన్ (46 రోజులు)
3. ఆర్ఆర్ఆర్ - A$3.6 మిలియన్
4. కల్కి 2898 ఏడీ - A$3.13 మిలియన్
5. సలార్ - A$1.75 మిలియన్
6. సాహో - A$1.03 మిలియన్
7. బాహుబలి - A$995K
8. దేవర - A$952K
9. ఆదిపురుష్ - A$901K
10. పుష్ప - A$629K