'పుష్ప 2' ఓటీటీ... ఈసారి కన్ఫర్మ్
ఈ వీకెండ్‌లోనూ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్‌ను గత రెండు మూడు వారాలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల వచ్చిన పుష్ప 2 రీలోడెడ్ వర్షన్‌కి మంచి స్పందన దక్కింది. సినిమా వచ్చి ఆరు వారాలు దాటినా ఇంకా బుక్ మై షో ద్వారా ప్రతి రోజూ దాదాపు 10 వేల టికెట్లు అమ్ముడు పోతున్నాయి. ఈ వీకెండ్‌లోనూ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్‌ను గత రెండు మూడు వారాలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా ఎంత పెద్ద సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లో ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాని కొన్ని సినిమాలు మాత్రం ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కి నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రీలోడెడ్ వర్షన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కనుక కొన్ని రోజుల పాటు థియేటర్‌కి జనాలు వస్తారనే ఉద్దేశ్యంతో ఓటీటీ స్ట్రీమింగ్ ని వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్‌లో పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్‌కి సంబంధించి క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 జనవరి చివరి వారంకు 8 వారాలు పూర్తి చేసుకుంటుంది. కనుక జనవరి 30 లేదా 31న ఓటీటీలో స్ట్రీమింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ వీకెండ్ పూర్తి అయిన తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.
పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్ హక్కులను అత్యంత భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.2000 కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ ఓటీటీ ద్వారా ఈ సినిమా అత్యధికంగా వ్యూస్‌ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా వార్తల్లో నిలిచింది. సినిమా గురించి చాలా ప్రచారాలు జరిగాయి. అందుకే థియేట్రికల్ స్క్రీనింగ్ మిస్ అయిన వారు కచ్చితంగా ఓటీటీ ద్వారా చూడాలి అనుకుంటారు. అలాగే థియేటర్‌లో చూసిన వారు ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దాదాపుగా 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ని స్ట్రీమింగ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.