పుష్ప 2… ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?

‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1700 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది

Update: 2024-12-24 06:00 GMT

‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1700 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాలోని అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీగా కలెక్షన్స్ రావడం విశేషం.

జెట్ స్పీడ్ తో అక్కడ ఈ చిత్రం అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 14.27 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు వసూళ్లు చేసింది. అయితే ఈ సినిమా 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్ టార్గెట్ తో నార్త్ అమెరికాలో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఆల్ మోస్ట్ అక్కడ ‘పుష్ప 2’ మూవీ ముగింపు దశకి వచ్చేసింది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది.

అది సాధ్యం కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాకుంటే మేకర్స్ డిస్టిబ్యూటర్ కి వచ్చిన నష్టాన్ని చెల్లించనున్నారంట. ఇదిలా ఉంటే ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో చూసుకుంటే ‘పుష్ప 2’ చిత్రానికి 29.21 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోలేకపోయిన మిగిలిన దేశాలలో మాత్రం అంచనాలకి మించి ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

నార్త్ అమెరికా తర్వాత ‘పుష్ప 2’ అత్యధికంగా యూఏఈ, గల్ఫ్ కంట్రీస్ లో 5.4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తరువాత ఆస్ట్రేలియాలో కూడా 2.62 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. యూకే అండ్ ఐర్లాండ్ లో 2.22 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి. ఓవరాల్ గా అన్ని దేశాలలో చూసుకుంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నార్త్ అమెరికా - $14,273,728

యూకే & ఐర్లాండ్ - $2.22 మిలియన్

ఆస్ట్రేలియా - $2.62 మిలియన్

న్యూజిలాండ్ - $436K

జర్మనీ - $251K

యూఏఈ & ఇతర GCC - $5.4 మిలియన్

సింగపూర్ - $486K

మలేషియా - $580K

శ్రీలంక - $146K

నేపాల్ - $1.3 మిలియన్

ఇతర యూరప్ దేశాలు & రెమైనింగ్ వరల్డ్ - $1.5 మిలియన్ (అంచనా)

మొత్తం కలెక్షన్స్ 18 రోజుల్లో గ్రాస్) - $29.21 మిలియన్

Tags:    

Similar News