NBA లో పుష్ప 2 క్రేజ్ చూశారా..
డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్, నేషనల్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.1831 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
అయితే పుష్ప-2కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సంగతి విదితమే. ఫస్ట్ పార్ట్ కు అదిరిపోయిన మ్యూజిక్ అందించిన ఆయన.. ఇప్పుడు మరోసారి తన వర్క్ తో మెప్పించారు. పుష్ప-2లో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో పీలింగ్స్ పాట.. ఓ రేంజ్ లో అలరించింది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో నిలిచింది.
సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక.. తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. పాట రిలీజ్ అయ్యాక.. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు. కానీ పాట మాత్రం ఓ రేంజ్ లో అలరించింది. యూట్యూబ్ ను ఊపు ఊపేసింది. పీలింగ్స్ సాంగ్ అతితక్కువ టైమ్ లో 100 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.
తాజాగా NBA వేదికపై పీలింగ్స్ పాటను ప్రదర్శించారు. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో 45 మంది నృత్యకారులు డ్యాన్స్ చేశారు. బ్లూ అండ్ గోల్డెన్ కలర్ డ్రెస్ లో చిందులేశారు. స్టేడియంపై 18 వేల మంది ముందు ప్రదర్శన జరగ్గా.. అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ గా స్పందిస్తున్నారు. పుష్ప-2 రేంజ్ అంటే ఇది అని కామెంట్లు పెడుతున్నారు. గ్లోబల్ వైడ్ గా పుష్పరాజ్ క్రేజ్ అలా ఉందని చెబుతున్నారు. డ్యాన్స్ కూడా బాగా చేశారని అంటున్నారు. స్టెప్పులతో అదరగొట్టారని.. వీడియో అదిరిపోయిందని అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. అల్లు అర్జున్, రష్మికతోపాటు ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్, ధనుంజయ, జగదీష్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను మిరాస్లోవ్ కూబా బ్రోజెక్ నిర్వర్తించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించారు.