ఓటీటీనే వెయిటింగ్ లో పెట్టిన ఐకాన్ స్టార్!
థియేట్రికల్ గా సక్సెస్ అయితే ఒకలా...కాకపోతో ఆ సినిమా ఓటీటీ రిలీజ్ అన్నది మరోలా మారింది.
ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడం అన్నది నిర్మాతలకు ఇప్పుడెంత భారంగా మారిందన్నది చెప్పాల్సిన పనిలేదు. రకరకాల కండీషన్లతో సినిమాని ఓటీటీ యాజమాన్యాల్ని బ్రతిమలాడుకుని సినిమా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి దాపరించింది. థియేట్రికల్ గా సక్సెస్ అయితే ఒకలా...కాకపోతో ఆ సినిమా ఓటీటీ రిలీజ్ అన్నది మరోలా మారింది. ఇంకా నిర్మాతలు చెప్పుకోలేని ఎన్నో టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అయితే పుష్పరాజ్ మాత్రం ఓటీటీనే వెయిటింగ్ లో పెట్టాడు.
సాధారణంగా ఓటీటీలో సినిమా రిలీజ్ అవ్వాలంటే? థియేట్రికలర్ రన్ అనంతరం ఆరువారాల తర్వాత బొమ్మ వేసుకునే అవకాశం ఓటీటీలకు ఉంటుంది. నిర్మాతలతో ఆ రకమైన ఒప్పందాన్ని ఓటీటీలు చేసుకున్నాయి. ఆ ప్రకారమే ఓటీటీ రిలీజ్ లు జరుగుతున్నాయి. అయితే `పుష్ప-2` మాత్రం నిర్మాతలు చెప్పినప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎనిమిది వారాల వరకూ తమ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని నిర్మాతలు భావిస్తున్నారు.
అందుకు కారణం ఆ సినిమా భారీ విజయం సాధించడమే. తెలుగు రాష్ట్రాల్లో `పుష్ప-2` హవా తగ్గినా? నార్త్ బెల్ట్ లో మాత్రం ఆ దూకుడు తగ్గలేదు. ఇంకా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. స్థిరమైన వసూళ్లు కనిపిస్తున్నాయి. ఊపు చూస్తుంటే అక్కడ దంగల్ రికార్డులనే చెరిపేస్తుందా? అన్న సందేహం వస్తుంది. ఇప్పటికే పుష్ప నార్త్ లో 600 కోట్లకు పైగా సాధించింది. 800 కోట్ల వసూళ్లతో హిందీ సినిమాల రికార్డులన్నింటిని తిరగరాస్తుందనే అంచనాలున్నాయి.
అలాగే ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డు దంగల్ 2000 కోట్లతో సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డు. ఆ రికార్డు సైతం `పుష్ప-2` తిరగరాస్తుందా? అన్న డౌట్ మొదలైంది. ఈ లెక్కలన్నీ నిర్మాతలు బేరీజు వేసుకున్నారు. అందుకే చిత్రాన్ని ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ వెర్షన్ కూడా సిద్దమైంది. రిలీజ్ చేయడానికి నెట్ ప్లిక్స్ కూడా సిద్దంగా ఉంది. కానీ వెయిట్ అంటూ హోల్డ్ లో పెడుతున్నారు.