పుష్ప-2.. బాలీవుడ్ లో ఏమంటున్నారు?

అయితే సౌత్‌ లోని సమీక్షకులు, విమర్శకులు ఇప్పటికే పుష్ప సీక్వెల్ సూపర్ హిట్ అంటూ రివ్యూస్ ఇచ్చారు.

Update: 2024-12-05 10:29 GMT

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఆ మూవీ ప్రీమియర్స్ ను మేకర్స్ నిన్న పలుచోట్ల వేయగా.. నేడు వరల్డ్ వైడ్ గా 12వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పుష్ప‌ రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ ఇరగదీశారు. ఫ‌స్ట్ పార్ట్‌ కు మించి మాసీగా సాగిన క్యారెక్ట‌ర్ లో అదరగొట్టారు. గంగాల‌మ్మ గెట‌ప్‌ లో అల్లు అర్జున్ నటన అద్భుతమని అంతా కొనియాడుతున్నారు. అయితే సౌత్‌ లోని సమీక్షకులు, విమర్శకులు ఇప్పటికే పుష్ప సీక్వెల్ సూపర్ హిట్ అంటూ రివ్యూస్ ఇచ్చారు.

నార్త్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మూవీపై నార్త్ లో ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పుడు మూవీ కూడా అందరినీ అలరిస్తూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. సినిమా చూసిన చాలా మంది క్రిటిక్స్, రివ్యూ రైటర్స్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌ ను మెచ్చుకుంటున్నారు. సినిమాలో మల్టీ షేడ్ పుష్ప క్యారెక్టర్‌ లో అల్లు అర్జున్ బాగా నటించారని ప్రశంసిస్తున్నారు.

అదే సమయంలో ఫేమస్ వెబ్ సైట్ పింక్ విల్లా పుష్ప మూవీకి గాను 5కి 3 స్టార్స్ ఇచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అభివర్ణించింది. ఫిల్మ్‌ ఫేర్.. పుష్ప సీక్వెల్ ను ప్యూర్ మాస్ ఎంటర్టైనర్‌ గా పేర్కొంది. 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 5కి 3 స్టార్లు ఇచ్చింది. స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ డెప్త్‌ లో సినిమా.. ఫస్ట్ పార్ట్ కు మించిపోయిందని అభిప్రాయపడింది.

క్రిటిక్ తరణ్ ఆదర్శ్ 4.5 రేటింగ్ ఇచ్చారు. ఫస్ట్‌ పోస్ట్‌.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. బోనాఫైడ్ మాస్ బ్లాక్‌ బస్టర్‌ గా పేర్కొంది.

బాలీవుడ్ హంగామా 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్ అని చెప్పింది. పీపింగ్ మూన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. మొత్తానికి నార్త్‌ లో దాదాపు ప్రతి సమీక్షలో 3 లేదా అంతకంటే ఎక్కువ స్టార్స్ రేటింగ్ కనిపిస్తుంది. దీంతో పుష్ప సీక్వెల్ నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో క్లియర్ గా తెలుస్తోంది.

Tags:    

Similar News