బుక్‌ మై షోలో పుష్ప జోరు.. గంటలకు లక్ష!

బుక్‌ మై షో లో చివరి 24 గంటల్లో దాదాపుగా 1.2 మిలియన్‌ టికెట్లు అమ్మడు పోయాయి.

Update: 2024-12-05 09:32 GMT

అల్లు అర్జున్‌ పుష్ప 2 జోరు మామూలుగా లేదు. విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలను పెంచిందో అదే స్థాయిలో సినిమా విడుదల తర్వాత జోరు కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు రోజు వరకు దాదాపుగా రూ.135 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌ జరిగింది. విడుదల రోజు సైతం బుక్ మై షోలో అత్యధికంగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. బుక్‌ మై షో లో రెండు మిలియన్‌ల ఇంట్రస్ట్‌లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న పుష్ప 2 టికెట్ బుకింగ్‌లోనూ అదిరి పోయింది.


బుక్‌ మై షో లో చివరి 24 గంటల్లో దాదాపుగా 1.2 మిలియన్‌ టికెట్లు అమ్మడు పోయాయి. ఈ విషయాన్ని స్వయంగా బుక్ మై షో చూపిస్తుంది. అంతే కాకుండా ప్రతి గంట గంటకు ఎన్ని టికెట్లు బుక్‌ అయ్యాయి అనే విషయాన్ని సైతం బుక్ మై షో చూపిస్తూ ఉంటుంది. పుష్ప 2 సినిమా కోసం గంటలకు 97.74 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దాదాపు లక్ష టికెట్స్ గంటలో అమ్ముడు పోవడం అంటే మామూలు విషయం కాదు. గతంలో కల్కి సినిమాకు గంటలకు 95.7 వేల టికెట్లు అమ్ముడు పోయి రికార్డ్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 బుక్‌ మై షో లో సరికొత్త రికార్డును నమోదు చేయడం జరిగింది.

ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడు పోవడం చూసి మైత్రి మూవీ మేకర్స్‌ వారు సైతం షాక్ అవుతూ ఉంటారు. సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో రెండో షో నుంచి రెగ్యులర్‌ ఆడియన్స్‌ సైతం సినిమా కోసం టికెట్లు బుక్‌ చేస్తూ ఉన్నారు. రివ్యూలు చూసి సినిమాలను చూసే వారు వీకెండ్‌ కోసం టికెట్లు బుక్‌ చేస్తూ ఉన్నారు. బుక్ మై షో డాటా ప్రకారం శని, ఆది వారాలకు సంబంధించిన షోలు దాదాపు 70 శాతం ఇప్పటికే హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. మరో రోజు గ్యాప్‌ ఉన్న కారణంగా ఆ 30 శాతం షో లు సైతం ఫుల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ నటనతో పాటు రష్మిక మందన్న నటన గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దర్శకుడు సుకుమార్‌ సినిమాను మరో స్థాయిలో చూపించారు. జాతర ఎపిసోడ్‌తో సినిమా స్థాయి పది రెట్టు పెరిగిందని, కొందరు విమర్శిస్తున్నట్లుగా విలన్‌ పాత్ర మరీ వీక్‌గా ఏమీ లేదు అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీకెండ్‌ పూర్తి అయ్యే వరకు ఈ సినిమా సాధించబోతున్న వసూళ్లను చూసి బాలీవుడ్‌ స్టార్స్ సైతం షాక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News