పుష్ప 2 - అనుకున్నట్లే బాహుబలి 2 మేజర్ రికార్డ్ బ్రేక్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం క్రాస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే హిందీలో కూడా 700 కోట్ల కలెక్షన్స్ కి దగ్గరగా ఈ మూవీ వసూళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ షేర్ పరంగా ఇప్పుడు మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో సెకండ్ హైయెస్ట్ షేర్ మొన్నటి వరకు ‘బాహుబలి 2’ పేరు మీద ఉండేది. ఈ మూవీ 204 కోట్ల షేర్ లాంగ్ రన్ లో అందుకుంది. అయితే ‘పుష్ప 2’ మూవీ ఇప్పుడు ‘బాహుబలి 2’ మూవీ 204 కోట్ల షేర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ 210 కోట్ల షేర్ దిశగా పరుగులు పెడుతోంది.
దీంతో తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ‘పుష్ప 2’ పేరు మీదకి వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్ తెలుగులో 272 కోట్ల షేర్ తో టాప్ లో ఉంది. దీనిని అయితే ‘పుష్ప 2’ అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. షేర్ కలెక్షన్స్ లో ‘బాహుబలి 2’ ని బ్రేక్ చేసిన ‘పుష్ప 2’ ఇంకా గ్రాస్ పరంగా మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ‘పుష్ప 2’ మూవీ ఇప్పటి వరకు 315 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా, ‘బాహుబలి 2’ మూవీ లాంగ్ రన్ లో 330 కోట్లు వసూళ్లు చేసింది.
దీనిని ‘పుష్ప 2’ మూవీ ఆ కలెక్షన్స్ ని ఏ మేరకు అందుకోగలుగుతుందనేది వేచి చూడాలి. హిందీలో ‘పుష్ప 2’ మూవీ 650 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం 30 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లని అందుకుంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఇప్పటికే పెరిగిపోయింది.
ఇదే ఊపులో ‘పుష్ప 3’ కూడా వచ్చేస్తే 2000 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చుట్టూ తెలంగాణాలో రాజకీయ వివాదం నడుస్తోంది. దీని నుంచి బయటపడిన తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.