దేవుడు సైతం హీరో, హీరోయిన్ భ*గిమ‌ల్లో!

స్టార్ హీరోలంటే అభిమానులు ఎంత‌లా ఆరాదిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-04 06:10 GMT

స్టార్ హీరోలంటే అభిమానులు ఎంత‌లా ఆరాదిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల‌కు పాలాభిషేకాలు.. కుంకుమ అభిషేకాలు...ర‌క్తాభిషేకాలు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిదే. అభిమానం హ‌ద్దు మీరితే ఎలా ఉంటుంది అన‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. త‌మ అభిమాన స్టార్ కోసం ప్రాణాలు సైతం అర్పిం చిన వారెంతో మంది ఉన్నారు. సినిమా వేడుక‌ల సంద‌ర్భంగా తొక్కిస‌లాట‌లోక‌న్నుమూసిన వారు ..క‌రెంట్ షాక్ తో చ‌నిపోయిన వారెంతో మంది.

తాజాగా ఇప్పుడు ఏకంగా దేవుడిని సైతం హీరో..హీరోయిన్ ఫోజుల్లోకి మార్చేస్తున్నారంటే? సన్నివేశం ఎంత‌లా ఉందో అద్దం ప‌డుతుంది. వినాయ‌క చ‌వితి స‌మీపంచ‌డంతో వినాయ‌కుడిని విగ్ర‌హాల‌ను హీరో, హీరోయిన్ల ఫోజుల్లో త‌యారు చేయ‌డం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అల్లు అర్జున్- ర‌ష్మిక మంద‌న్న నటించిన `పుష్ప‌` సినిమాలో ఓ ఫోజుని కాపీ కొట్టి చ‌వితి సంద‌ర్బంగా ఓ వినాయ‌కుడిని త‌యారు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది.

ఆ విగ్ర‌హం ఇంకా పూర్తిగా త‌యార‌వ్వ‌లేదు. వాళ్లిద్ద‌రి ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రోస‌స్ లో భాగం ఇలా వినాయ‌కుడిని త‌యారు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే దీనిపై నెటి జ‌నులు మండిప డుతున్నారు. అభిమానం పేరుతో దేవుళ్ల విగ్ర‌హాల‌ను అప‌హ‌స్యం చేయోద్ద‌ని కామెంట్లు పెడుతున్నారు. ముంబై వంటి న‌గ‌రంలో వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్ తోనూ వినాయ‌కుడి విగ్ర‌హాలను త‌యారు చేసి అమ్మ‌కాలు జ‌రుపు తున్నారు. ఈ తీరుపైనా స్థానిక జనం మండిప‌డ్డారు.

ఇలాంటి వాటి విష‌యంలో హీరోలు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. అభిమానుల్లో అవేర్ నెస్ తీసుకు రావాలి. మ‌హేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇలాంటివి చేయోద్ద‌ని ఎన్నో సంద‌ర్భాల్లో అభిమానుల్ని కోరారు. హీరోలంతా మేము బాగానే ఉంటాం..మీరు ఇంకా బాగుండాల‌ని మ‌హేష్ ఓసినిమా ఈవెంట్లో అన్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా హీరోల కాళ్ల మీద ప‌డొద్ద‌ని, త‌ల్లిదండ్రుల త‌ర్వాతే ఎవ‌రైనా అని చాలా సంద‌ర్బాల్లో హిత‌బోధ చేసారు.

Tags:    

Similar News