'పుష్ప 2' పాటలదీ అదే దారి!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

Update: 2024-12-03 06:45 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దాదాపుగా 12500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క పాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇతర మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్ వదిలేస్తే కేవలం యూట్యూబ్‌లోనే వందల మిలియన్‌ల వ్యూస్‌ను పుష్ప 2 పాటలు దక్కించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమా విడుదలకు ముందు దక్కించుకోలేని వ్యూస్‌ను పుష్ప 2 సినిమా పాటలు దక్కించుకుంటున్నాయి.

యూట్యూబ్‌లో పుష్ప పార్ట్‌ 1 పాటలకు దాదాపుగా 6 బిలియన్‌ల వ్యూస్ దక్కాయి. ఇది బాలీవుడ్‌ సినిమా ఆల్బమ్‌కి సైతం సాధ్యం కాని రికార్డ్‌. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప పార్ట్‌ 1 ఆల్బం సాధించిన రికార్డ్‌ నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమా పాటలు సైతం అదే దారిలో వెళ్తున్నాయి. ఇప్పటికే బిలియన్ వ్యూస్‌కి చేరువ అయిన పుష్ప 2 పాటలు ముందు ముందు సినిమా విడుదల తర్వాత చేసే సందడి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కిస్సిక్‌ పాట మొదలుకుని చూసేకి, పీలింగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్‌లో వందల కొద్ది మిలియన్స్‌ను చేరుకోవడం జరుగుతూనే ఉంది.

పుష్ప పార్ట్‌ 1 బ్లాక్‌ బస్టర్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాటలు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమా విజయంలోనూ పాటలు కీలకంగా మారబోతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. రికార్డ్‌ బ్రేకింగ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్న పుష్ప 2 మ్యూజిక్‌ ఆల్బం సినిమా విడుదల తర్వాత మరికొన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పుష్ప 2 పాటలకు కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు మిలియన్‌ల కొద్ది వ్యూస్‌ ఇస్తూ పాటలను చూస్తూ ఉన్నారు.

పుష్ప 2 పాటలకు హిందీలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. తెలుగులో ఏ స్థాయిలో వ్యూస్ లభిస్తున్నాయో అదే స్థాయిలో హిందీలోనూ వ్యూస్ దక్కుతున్నాయి. గతంలో ఏ సౌత్‌ సినిమాకు దక్కని స్పందన నార్త్‌ లో పుష్ప ఆల్బమ్‌ కి దక్కింది. డిసెంబర్‌ 4 ప్రీమియర్‌లతో సినిమా షురూ కాబోతుంది. భారీ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News