రెండుగా చీలిన పుష్ప 2 యూనిట్..?
నవంబర్ సెకండ్ వీక్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలనే టార్గెట్ తో పనిచేస్తున్న పుష్ప 2 టీం ఇలా అయితే కుదరదని గుర్తించి రెండు టీం లుగా విడిపోయి షూటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.
సుకుమార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సినిమాను పూర్తి చేయడంలో డైరెక్టర్ సుకుమార్ కాస్త కంగారు పడుతున్నారు. సినిమా విషయంలో సుక్కు తీసుకుంటున్న అతి జాగ్రత్త వల్ల ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది. అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని టాక్. పుష్ప 2 ని డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. ఐతే ఆ డేట్ కి రావాలంటే మాత్రం ఇంకాస్త స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారట.
నవంబర్ సెకండ్ వీక్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలనే టార్గెట్ తో పనిచేస్తున్న పుష్ప 2 టీం ఇలా అయితే కుదరదని గుర్తించి రెండు టీం లుగా విడిపోయి షూటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒక టీం అంతా కాకినాడలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. మరో టీం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో పాల్గొంటుంది. అల్లు అర్జున్ కూడా ఈసారి అనుకున్న డేట్ కి సినిమా వచ్చేలా సినిమా పూర్తయ్యే వరకు తన డేట్స్ అందుబాటులో ఉంచాడట.
ఎటొచ్చి సుకుమారే గట్టిగా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ ఒక ఊపు ఊపేసింది. ఐతే పుష్ప 2 లో కూడా ఉ అంటావా సాంగ్ ని మించేలా ఒక సాంగ్ ఉంటుందని టాక్. మరి ఆ స్పెషల్ సాంగ్ లో ఎవరు చేస్తారన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ నెక్స్ట్ మంత్ షూట్ చేస్తారని తెలుస్తుంది.
పుష్ప 2 బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో పుష్ప 2 వస్తుందని అంటున్నారు. ఇప్పటికే నార్త్ సైడ్ బిజినెస్ జరిగిపోగా, ఓవర్సీస్ నుంచి కూడా భారీ డీల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఓటీటీ రైట్స్ రూపంలో కూడా పుష్ప 2 కి భారీ ఆఫర్లు వచ్చినట్టు టాక్. మొత్తానికి పుష్ప 2 కి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సినిమా కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించే ఛాన్స్ ఉంటుంది.