మెగాస్టార్ తో పుష్ప 2 టీమ్..!
మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసిన సినిమా లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పూనకాలు తెప్పిస్తుంది.
అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబో సినిమాలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా నేడు రిలీజై ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసిన సినిమా లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పూనకాలు తెప్పిస్తుంది. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆడియన్స్ కు పిచ్చెక్కించేశాయి.
సినిమా రిలీజైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ క్రమంలో పుష్ప 2 యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను చూసి చిరంజీవితో స్పెషల్ మీటింగ్ ఏర్పరచుకున్నారు. డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు నవీన్, రవి శంకర్ CEO చెర్రిలు చిరుని కలిశారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిరంజీవి పుష్ప 2 యూనిట్ ని ప్రశంసించినట్టు తెలుస్తుంది.
సినిమాకు అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగానే వచ్చేలా ఉన్నాయి. నార్త్ బెల్ట్ లో కూడా సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. బాలీవుడ్ మీడియా కూడా పుష్ప 2 కి సూపర్ రేటింగ్ ఇచ్చింది. పుష్ప 2 సినిమా విషయంలో అల్లు ఫ్యాన్స్ అంతా సూపర్ హ్యాపీగా ఉన్నారు. అల్లు అర్జున్ మాస్ స్టామినా ఏంటన్నది మరోసారి పుష్ప 2 తో ప్రూవ్ అవుతుంది. సుకుమార్ మీద అల్లు అర్జున్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సుకుమార్ నెక్స్ట్ సినిమా చరణ్ తో చేస్తున్నాడు.
ఆల్రెడీ రంగస్థలం తో ఈ కాంబో సెన్సేషనల్ హిట్ అందుకుంది. మళ్లీ చరణ్ తో అంతకుమించే సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పూర్తి చేశాడు. జనవరి 10న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ సినిమా వస్తుంది. ఆర్సీ 16 సినిమా తర్వాత ఆర్సీ 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుంది. సుకుమార్ పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3 అని కూడా వేశాడు. మరి ఆ సినిమా చరణ్ సినిమాకు ముందు చేస్తాడా లేదా తర్వాత చేస్తాడా అన్నది చూడాలి. పుష్ప 2 మాత్రం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ స్టఫ్ తో అదరగొట్టేస్తుంది.