చలికి వేడి పుట్టించేలా పీలింగ్స్ వీడియో సాంగ్ వచ్చేసింది
ఎప్పుడెప్పుడు ఆ పాట పూర్తిగా చూస్తామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూశారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన పాటలు సినిమా స్థాయిని పెంచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా విడుదలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల పీలింగ్స్ పెంచేసిన పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్, రష్మికల డాన్స్ అదిరి పోయింది.
ఎప్పుడెప్పుడు ఆ పాట పూర్తిగా చూస్తామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూశారు. సినిమాలో చూసిన ఆ పాటను ఇప్పుడు యూట్యూబ్‌లో పూర్తిగా చూడవచ్చు. యూట్యూబ్ ద్వారా పీలింగ్స్ వీడియో సాంగ్ వచ్చేసింది. సినిమాపై అంచనాలు పెంచిన ఆ పాట ఇప్పుడు మరింతగా ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి. ఆ పాట కోసం రష్మిక వేసిన డాన్స్ కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో బిట్‌లు బిట్‌లుగా ఇప్పుడు ఆ పాటను నెటిజన్స్ షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ డాన్స్‌లో తోపు అనడంలో సందేహం లేదు. అలాంటి అల్లు అర్జున్‌ను మ్యాచ్ చేస్తూ రష్మిక మందన్న పీలింగ్స్ లో డాన్స్ వేసింది. అంతే కాకుండా వారి డాన్స్ మూమెంట్స్, రష్మిక కాస్ట్యూమ్స్ చలికి వేడి పుట్టించే విధంగా ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీడియో సాంగ్‌కి లిరికల్ వీడియో కంటే ఎక్కువ స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో ఈ పాట అత్యధిక వ్యూస్‌ను రాబట్టినా ఆశ్చర్యం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల రష్మిక మందన్న మరింత అందంగా కనిపిస్తు పీలింగ్స్ పాటకు డాన్స్ చేస్తూ ఉంటే రెండు కళ్లు చాలడం లేదు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటికే అత్యధిక వసూళ్ల జాబితాలో టాప్ 3 కి చేరింది. రూ.1300 కోట్ల వసూళ్లతో టాప్ పొజీషన్‌లో నిలిచిన పుష్ప 2 సినిమాను హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని మరీ వసూళ్లు ఇస్తున్నారు. ఇప్పటికే అక్కడ అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి. హిందీలోనే దాదాపుగా రూ.600 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా సినిమా యూఎస్‌లో 12 మిలియన్ డాలర్లను మించి వసూళ్లు చేసింది. ఇక సినిమా లాంగ్ రన్‌లో బాహుబలి 2 వసూళ్లను బ్రేక్ చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో రూ.500 కోట్లు వసూళ్లు చేస్తే పుష్ప 2 టాప్ 2 లో ప్లేస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.