పుష్ప 2 బాక్సాఫీస్: యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 మూవీస్!

తాజాగా విడుదలైన పుష్ప 2: ది రూల్ యూకే మార్కెట్‌లో అద్భుతమైన వసూళ్లను సాధించింది.

Update: 2025-01-21 13:30 GMT

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటుకొని పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రాలు రికార్డులు సృష్టిస్తుండగా, యూకే బాక్సాఫీస్‌ కూడా తెలుగు సినిమాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. తాజాగా విడుదలైన పుష్ప 2: ది రూల్ యూకే మార్కెట్‌లో అద్భుతమైన వసూళ్లను సాధించింది. కేవలం 46 రోజుల్లోనే £1.90 మిలియన్ వసూలు చేసి, ఈ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా అవతరించింది.

బాహుబలి 2 ఇప్పటివరకు £1.82 మిలియన్ వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును అధిగమించింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ మార్క్ ఎలివేషన్ సీన్స్ బాగా క్లిక్కయ్యాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. సినిమా మేకింగ్ విధానం పుష్ప 2ని యూకే ఇండియన్ ప్రేక్షకుల ముందు స్పెషల్ గా నిలబెట్టింది.

ఇక మూడో స్థానంలో £1.55 మిలియన్ వసూళ్లతో కల్కి 2898AD నిలిచింది. ఈ చిత్రం కథ, విజువల్ గ్రాండియర్ ద్వారా ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. ఇక రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ £1.03 మిలియన్ వసూళ్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం యూకే మార్కెట్‌లో భారతీయ సినిమాల పరిపాటిని మార్చిన చిత్రంగా నిలిచింది.

ఇంకా, సలార్ £620K, దేవర £550K, ఆదిపురుష్ £395K వసూలు చేసి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ చిత్రాల విజయాలు తెలుగుసినిమా గ్లోబల్ మార్కెట్‌లో తన స్థాయిని పెంచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రత్యేకంగా హనుమాన్, సాహో, బాహుబలి మొదటి భాగం వంటి చిత్రాలు టాప్ 10 జాబితాలో ఉండడం గమనార్హం. ఈ జాబితా తెలుగు సినిమా సక్సెస్ రేంజ్‌ను ప్రదర్శిస్తుంది. పుష్ప 2 విజయం పాన్ వరల్డ్ సినిమాల స్థాయికి తెలుగు చిత్రాలను తీసుకెళ్తుండగా, ఇతర చిత్రాలు కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. యూకే మార్కెట్‌లో ఇలాంటి రికార్డులు సృష్టించడం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలలో మరో అచివ్ మెంట్ అని చెప్పవచ్చు.

యూకే బాక్సాఫీస్ టాప్ 10 తెలుగు సినిమాలు (వసూళ్లు పౌండ్లలో):

1. పుష్ప 2 - £1.90 మిలియన్ (46 రోజులు)

2. బాహుబలి 2 - £1.82 మిలియన్

3. కల్కి 2898AD - £1.55 మిలియన్

4. ఆర్ఆర్ఆర్ - £1.03 మిలియన్

5. సలార్ - £620K

6. దేవర - £550K

7. ఆదిపురుష్ - £395K

8. హనుమాన్ - £321K

9. బాహుబలి - £311K

10. సాహో - £293K

Tags:    

Similar News