పుష్ప 2.. బన్నీకి అన్నీ వైపులా సాధ్యమే..

ఆగష్టులో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. దీంతో తమిళ్, మలయాళీ ఆడియన్స్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Update: 2024-03-07 04:50 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్ గత రెండేళ్ల నుంచి పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సారి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. పుష్ప ది రూల్ కి ఆ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉంది.

దీనికి కారణం ఐకాన్ స్టార్ ఇమేజ్ అని చెప్పాలి. టాలీవుడ్ హీరోలలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళీ భాషలలో కూడా ఫాలోయింగ్ ఉన్న స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమే. మిగిలిన హీరోలకి అంత స్ట్రాంగ్ మైలేజ్ కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలలో లేదు. అల్లు అర్జున్ సినిమాలు చాలా వరకు మలయాళంలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. అందుకే అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది.

పుష్ప సినిమాలో కొంత కంటెంట్ తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో పాటు అక్కడి కల్చర్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది. ఈ కారణంగా పుష్ప మూవీకి తమిళ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. తెలుగులో కంటే తమిళంలో పుష్ప పెద్ద హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పుష్ప ది రూల్ మూవీపైన కూడా ఆ రెండు రాష్ట్రాలలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

నార్త్ ఇండియా మార్కెట్ లో ఇప్పటికి పుష్ప సాంగ్స్, డైలాగ్స్ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మూవీ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి తెలుగులో కూడా పుష్ప 2 పైన భారీ హైప్ నెలకొని ఉంది. ఈ నాలుగు భాషలలో ఇండస్ట్రీల మార్కెట్ లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని పుష్ప 2 మూవీ చూపించగలిగితే చిత్ర యూనిట్ ఎక్స్ పెక్ట్ చేసినట్లే 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంటుంది.

ఆగష్టులో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. దీంతో తమిళ్, మలయాళీ ఆడియన్స్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మూవీ డిజిటల్ రైట్స్ కోసం కూడా స్ట్రీమింగ్ కంపెనీల మధ్య పోటీ నెలకొని ఉంది.

Tags:    

Similar News