సింధు (X) దత్త సాయి: మంచు కొండల్లో ప్రేమ సరాగాలు
చుట్టూ దట్టమైన మంచు.. ఎటు చూసినా వెండిమబ్బు విరిగిపడిందా! అన్న చందంగా ఆ ప్రాంతం ధగధలు.... అక్కడ ఒక అందమైన కొత్త జంట లవ్ లీ ఫోటోషూట్.
చుట్టూ దట్టమైన మంచు.. ఎటు చూసినా వెండిమబ్బు విరిగిపడిందా! అన్న చందంగా ఆ ప్రాంతం ధగధలు.... అక్కడ ఒక అందమైన కొత్త జంట లవ్ లీ ఫోటోషూట్. ముసి ముసి నవ్వులు.. ఘాడమైన రొమాన్స్... ప్రేమ పక్షుల కువకువలు.. స్టిల్ ఫోటోగ్రాఫర్ చాలా ఎలివేషన్స్ కోసం పి.వి.సింధు- దత్తసాయి జంటను చాలా ఇబ్బంది పెట్టాడని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.
మంచి ఎక్స్ ప్రెషన్.. అందమైన నవ్వు.. మంచు దుప్పటి నేపథ్యానికి తగ్గట్టు డ్రెస్ సెలక్షన్.. వీటన్నిటి కోసమే రోజుల తరబడి కసరత్తు చేసారా? అనిపిస్తోంది. కొత్త జంట ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తోంది. ''జంట కుదిరింది.. జోడీ అదిరింది!'' అంటూ ఈ ఫోటోషూట్ ని చూసాక అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతూ ఈ అందమైన ఫోటోషూట్ తో అభిమానులను పలకరించింది ఈ జంట.
పివి సింధు - వెంకట దత్తసాయి 2025కి స్వాగతం పలుకుతున్న ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు 31 మిడ్ నైట్ లో పివి సింధు- దత్త సాయి జంట కొత్త సంవత్సరాన్ని స్వాగతించిన ఫోటోలు వెబ్ లోకి వచ్చాయి. ఎరుపు రంగు స్లీవ్‌లెస్ దుస్తులలో సింధు కనిపించగా, నల్లని చొక్కా- ప్యాంటు లో దత్తసాయి కనిపించారు. ఆయన చొక్కాపై నల్లటి జాకెట్‌ను ధరించారు.
పివి సింధు -వెంకట దత్త సాయి డిసెంబర్ 22న ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు. డిసెంబరు 24న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విందులో సచిన్ టెండూల్కర్, చిరంజీవి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పివి సింధు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. దత్తసాయి హైదరాబాద్ కి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్. క్రీడలతో అనుబంధం ఉన్న ఒక పెద్ద కార్పొరెట్ సంస్థను నడుపుతున్నారు.