ఆ వివాదంతో మా హీరోకి ఎలాంటి సంబంధం లేదు!
బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తోన్న `ది గ్రేట్ ఇండియన్ కఫిల్ షో` ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు
బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తోన్న `ది గ్రేట్ ఇండియన్ కఫిల్ షో` ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లగా కపిల్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో ప్రసారమవుతోంది. అయితే ఇటీవల ఈ షోలో విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ బోంగాబాషీ మహాసభ పౌండేషన్ సీరియస్ అయింది. దీనికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది.
దీనిలో భాగంగా సల్మాన్ కూడా నోటీసులు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై సల్మాన్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని కొట్టిపారేసారు. తమకు కపిల్ షోకు ఎలాంటి సంబంధం లేదని సల్మాన్ ఖాన్ గానీ, ఆయనకు చెందిన ఎస్ కే టీవీకి గానీ ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. గ్రేట్ ఇండియన్ షోతో తమకు ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టత ఇచ్చారు.
దీంతో సోషల్ మీడియాలో జరిగేది అంతా ప్రచారమని తెలిపోయింది. ఈ వివాదానికి-సల్మాన్ ఖాని ఎలాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారో తెలిసిందే. ఇంటి చుట్టూ భద్రత, బయటకు వెళ్లలన్నా? షూటింగ్ కి వెళ్లాలన్నా పటిష్ట భద్రతా దళాల మధ్య వెళ్లడం, పని చేయడం వంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో `సికందర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ సెట్స్ కి వెళ్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.